Anita Anand: కెనడా(Canada) ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రధాని పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో ఆయన పార్టీ బాధ్యతలతోపాటు, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈతరుణంలో తదుపరి ప్రధాని ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కెనడా మంత్రి, భారత సంతతి మహిళ అనితా ఇందిరా ఆనంద్ పేరు తెరపైకి వచ్చింది. కెనడాలోని నోవాస్కోటియాలోని కెంట్విల్లెలో జన్మించిన అనిత తల్లి సరోజ్ దౌలత్ ఆమ్ అనస్తీషియాలజిస్ట్. ఆమెది పంజాబ్. తండ్రి సుందరం వివేక్ స్వస్థలం తమిళనాడు. ఆయన జనరల్ సర్జన్. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి అనిత(Anitha). నైజీరియాలో కొన్నాళ్లు ఉన్న వివేక్, సరోజ్ దౌలత్ దంపతులు 1960లో కెంట్విల్లేకు వలస వచ్చారు. అనితా ఆనంద్ గ్రామీణ వాతావరణంలో పెరగడంతో తనకు విలువలతో కూడిన పనితీరు అలవడింది అని పేర్కొంటారు. స్థానికంగా ప్రాథమిక విద్య పూర్తి చేశాక క్వీన్స్ యూనివర్సిటీలో పొలిటికల్ స్టడీస్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆక్స్‌ఫర్డ్, డల్హౌసీ యూనివర్సిటీలో లా పంట్టాలు పొందారు.
కార్పొరేట్ లాయర్‌గా..
అనిత కార్పొరేట్ లాయర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ప్రముఖ యూనివర్సిటీల్లో లా ప్రొఫెసర్‌గా, విజిటింగ్ లెక్చరర్‌గా, బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. ఆమె రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. లిబరల్ పార్టీ సభ్యురాలిగా 2019లో హౌస్ ఆఫ్ కామన్స్ ఓక్‌విల్లే నుంచి మొదటిసారి ఎన్నికయచ్యారు. 2021 వరకూ పబ్లిక్‌సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్ మంత్రిగా పనిచేశారు కెనడాలో ఈ పదవి అలంకరించిన మొదటి హిందూ మహిళగా గుర్తింపు పొందారు. కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ అందించడంలో సమర్థవంతంగా వ్యవహరించారనే గుర్తింపు ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన సమయంలో ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందించడానికి కెనడా చేసిన ప్రయత్నాలకు అనిత నాయకత్వం వహించారు. మాజీ రక్షణ మంత్రి సజ్జన్‌పై ఆరోపణలు రావడంతో ఆర్మీలో సంస్కరణలు తెచ్చేలా అనిత రక్షణ మంత్రిగా పనిచేశారు. సాయుధ దళాల్లో లైంగిక వేధింపులు అరికట్టేందుకు కొత్త సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రస్తుతం రవాణా, వాణిజ్య మంత్రిగా ఉన్నారు.
అనిత రాజకీయ ప్రస్థానం..
అనిత కెనడా కాన్సర్వేటివ్ పార్టీ (Conservative Party of Canada)కి చెందిన నాయకురాలు. అనిత ఎటువంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తుందో, అవి ప్రజలకు ఎంత ఆకట్టుకుంటాయో, ఆమెకు ఉన్న నైపుణ్యాలు, రాజకీయ కృషి, తాత్కాలిక అవసరాలపై ఆమె అభిప్రాయం ప్రజలపై ఎంత ప్రభావం చూపుతుందో అన్నది ఆమె ప్రధాన విజయ సూత్రం. భారతీయ–కెనడియన్, ఇతర కెనడియన్ సామాజిక వర్గాలతో అనిత అవగాహన పెంచుకుంటున్నందువల్ల ఆమెకు మద్దతు వచ్చే అవకాశం ఉంది. అనిత కెనడాలోని భారతీయ–కెనడియన్ వర్గం నుండి వస్తుంది. ఈ వర్గం దేశంలో పెద్ద సంఖ్యలో ఉండడంతో, ఈ వర్గం నుండి మద్దతు పొందడం ఆమెకు ఒక ప్రత్యేకమైన లక్షణం. కానీ, ఇదే సమయంలో ఆమెకు కాన్సర్వేటివ్ పార్టీతో జంటగా ఉండటం కొంత సవాలు కావచ్చు, ఎందుకంటే ఆమెకు మరికొన్ని సామాజిక–ఆర్ధిక అంశాలలో ఆ పార్టీని సవాలు చేయాల్సి వస్తే, అది ఆమె విజయాన్ని అడ్డుకోవచ్చు.
ఆర్థిక పరిజ్ఞానం..
అనితకు ఆర్థిక రంగంలో పరిజ్ఞానం, విశ్లేషణ నైపుణ్యాలు ఉంటే, కెనడాలో ఉద్యోగుల రక్షణ, వృద్ధి, ఆరోగ్య సేవలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆ రంగంలో శక్తివంతమైన ప్రణాళికలు రూపొందించవచ్చు. కెనడా ప్రజలకు ఆర్థిక సహాయం, రక్షణ ప్రణాళికలు అవసరమై ఉన్నాయి, వాటిపై అనిత వ్యవస్థాపనతో అటువంటి అవసరాలు తీర్చగలదు. నిత, కెనడా ప్రజలతో బలమైన సంబంధాలు పెంచుకునేందుకు తన దృష్టిని విస్తరించవచ్చు. ఆమె ప్రస్తుత నాయకత్వ లక్ష్యాలు, నిజాయితీ, పారదర్శకత, సామాజిక సమైక్యత వంటి అంశాలను ముందుకు తీసుకువెళ్లడం ద్వారా, ఈ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల నమ్మకాన్ని కలిగించుకోవచ్చు.
పురస్కారాలూ– గుర్తింపులూ...
కెనడాలోని ఐక్యరాజ్య సమితి విభాగం ఆమెకు 2022 గ్లోబల్ సిటిజన్ అవార్డు అందించింది. ఉదారత, సృజనాత్మకత, నాయకత్వం వంటి లక్షనాలు పుణికిపుచ్చుకున్నవారికి ఈ పురస్కారం ఇస్తుంది. అనిత కెనడా రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో సైన్యంలో లైంగిక వేధింపులకు గురైన బాధితుల తరఫున వాదించినందుకు విన్న పెగ్గాలోని మహాతాగాంధీ సెంటర్ గాంధీ శాంతి బహుమతి అందించింది. అనిత లింగ సమానత్వం, డైవర్సిటీ, ఎల్జీబీటీక్యూ హక్కుల కోసం గళమెత్తారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Who is anita anand a leading contender to replace justin trudeau as prime minister of canada
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com