Donald Trump: ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రపంచం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల తీసుకున్న సుంకాల నిర్ణయాలు అమెరికా వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. దీంతో గత్యంతరం లేక ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తిరోగమన పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికాలోనే ఈ నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ ట్రంప్ ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు.
ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజు కు సంబంధించి తీసుకుని నిర్ణయాన్ని వైట్ హౌస్ సమర్థించడం విశేషం. అంతే కాదు ఏకంగా ఫ్యాక్ట్ షీట్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా అనేక వివరాలను అందులో వెల్లడించింది.. ” 2003లో 32 శాతం ఉన్న వీసాలు ఇప్పుడు 65 శాతానికి పెరిగిపోయాయి. నిరుద్యోగుల సంఖ్య డబుల్ అయ్యింది. ఈ ఏడాది ఒక కంపెనీ 5189 వీసాలను ఆమోదించింది. ఏకంగా 16,000 మంది అమెరికా ఉద్యోగులను తొలగించేసింది. మరో కంపెనీ 2022 నుంచి 25,075 వీసాలను పొందింది. స్థానికంగా ఉన్న 27 వేల మందిని తొలగించింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కాబట్టే అమెరికా ఓటర్లు ట్రంప్ నాయకత్వాన్ని కోరుకున్నారు. తమ భవిష్యత్తు కు ట్రంప్ బాటలు వేస్తారని భావించారు. అందువల్లే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆమోదయోగ్యమైనది. అద్భుతమైనదని” వైట్హౌస్ పేర్కొంది.
వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..” అమెరికాలో అమెరికా దేశస్తులు గొప్పగా పని చేస్తారా? వారికి వేతనాలు ఎక్కువగా ఉండాలి.. సౌలభ్యాలు అధికంగా ఉండాలి. ప్రయోజనాలు భారీగా లభించాలి. అలా అయితేనే వారు పని చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయిలో వారికి డబ్బులు ఇచ్చుకుంటూ ఏ కంపెనీలు కూడా మనుగడ కొనసాగించలేవు. పైగా అమెరికా దేశస్థులు పని చేసే చోట ఎక్కువగా చట్టాల గురించి మాట్లాడుతుంటారు. చట్టాల వర్తింపు సక్రమంగా ఉంటాయి ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఆ విషయం తర్వాత బోధపడుతుంది. ఇప్పటికైతే డాలర్ డ్రీమ్స్ కోసం అమెరికాలో అడుగుపెట్టే వారి ఆశల మీద నీళ్లు చల్లారు. అవి అంత ప్రమాదమో తర్వాత అర్థమవుతుందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Read the facts⬇️https://t.co/QPOEjaqjNw
— The White House (@WhiteHouse) September 20, 2025