Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారన్న వార్తలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోమారు ఆయనను చంపేశాని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సోదరీమణులకు జైల్లో తనను కలవడానికి అనుమతులు ఇవ్వడం లేదు. ఈ మూడు వారాలపాటు కలవలేదని, జైలుకు వెళ్లి అకస్మాత్తుగా దాడి జరిగిందని సమాచారం బయటకు వచ్చింది.
చంపేశారా?
ఆఫ్గానిస్తాన్ మీడియా కూడా ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని, పాకిస్తా¯Œ ప్రభుత్వం ఐఎస్ఐతో చంపించిందని కథనం ప్రచురించింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఇలాంటి వార్తలను తీవ్రంగా తిరస్కరించింది. అధికారికంగా ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంగా ఉన్నారని, చికిత్స అందిస్తున్నామని తెలిపింది.
పార్టీ ఆందోళన
ఇమ్రాన్ ఖాన్ మరణం, ఆరోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్లో లక్షల మంది యువత జెన్–జీ ఉద్యమం పేరుతో ర్యాలీలు, ప్రదర్శనలు చేస్తూ ఉంటున్నారు. ఈ బలమైన ఉద్యమం పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌ను ఆందోళనలో పడేస్తోంది. సైన్యంలో విభిన్నతలు పెరుగుతుండటం, త్రివిధ దళాల అధిపతిగా ఆయన ఉండటం నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి అనుకూలంగా లేకపోవడం ఆందోళనలకు దారి తీసింది.
స్థిరత్వం కోసం స్పష్టత కావాలి..
ఇమ్రాన్ ఖాన్ మరణసంబంధిత సందేహాలను ప్రభుత్వం తక్షణమే స్పష్టతతో తీర్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే పాకిస్తాన్ లో ఈ అనిశ్చిత పరిస్థితులు మరింత క్షోభాలకు దారి తీసే ప్రమాదం ఎక్కువగా ఉంది. చిరకాలం ఉంటే ఆందోళనలు సడలుతాయని, ఆర్థిక–రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతుందని భావిస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, జీవితం సారథ్యం గురించి ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. అధికార వర్గాలు తప్పుడు కథనాలు అని కొట్టేస్తున్నాయి. కానీ అధికారికంగా ఆయన గురించి ఎలాంటి విషయం వెల్లడించడం లేదు. దీంతో అనుమానాలు పెరుగుతున్నాయి.