Elon Musk Netflix Boycott: బలవంతుడితో యుద్ధం చేయవచ్చు. బలహీనుడితో కూడా యుద్ధం చేయవచ్చు. కానీ మూర్ఖుడితో యుద్ధం చేయలేం. ఎందుకంటే గెలిచే సత్తా మనలో ఉన్నప్పటికీ కూడా.. అతగాడి మూర్ఖత్వం వల్ల కచ్చితంగా ఓడిపోతాం.. ఇది ఓ ఆఫ్రికన్ సామెత. ఈ సామెత అమెరికా అధ్యక్షుడికి అనుభవంలోకి వచ్చింది. ఎలాన్ మస్క్ నిర్వాకం వల్ల ఎంతటి తప్పిదం జరిగిందో ట్రంప్ కు అర్థమైంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మస్క్ తో రాసుకుపూసుకు తిరిగాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అతడిని తన ప్రభుత్వంలోకి తీసుకున్నాడు. కీలకమైన బాధ్యతలు కూడా అప్పగించాడు. కానీ మస్క్ మామూలు వ్యక్తి కాదు కదా.. పైగా వ్యాపారి.. అందులోనూ బీభత్సమైన మూర్ఖత్వ లక్షణాలు ఉన్న మనిషి.. అలాంటి వ్యక్తి ట్రంప్ చెబితే ఎందుకు వింటాడు.. ట్రంప్ గీసిన గీతలో ఎందుకు ఉంటాడు.. అందువల్లే త్వరగానే బయటికి వచ్చాడు. ట్రంప్ మీద అవకాశం దొరికిన ప్రతిసారి నోరు పారేసుకుంటూనే ఉన్నాడు.
మస్క్ ను చేరదీసినందుకు.. సహాయం కోరినందుకు ఇప్పటికీ ట్రంప్ లెంపలు వేసుకుంటూనే ఉన్నాడు. అయితే మస్క్ వల్ల జరిగే నష్టం ఎలా ఉంటుందో ట్రంప్ కు అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రఖ్యాత ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కు కూడా మస్క్ దెబ్బ ఎలా ఉంటుందో అర్థమైంది.. ఆ దెబ్బ ఎంత విలువైందో ఇప్పుడు ఆ సంస్థకు అర్థమవుతోంది.
ఆటోమొబైల్ రంగాన్ని.. మీడియా రంగాన్ని.. స్పేస్ రంగాన్ని శాసిస్తున్నాడు మస్క్. ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను విక్రయిస్తూ ఆగర్భ శ్రీమంతుడిగా వెలిగిపోతున్నాడు. అటువంటి మస్క్ నెట్ ఫ్లిక్స్ కు ఊహించని నష్టాన్ని చేకూర్చాడు.. ఇటీవల అతడు cancel Netflix for the healthy of your kids అనే పేరుతో ఒక ట్వీట్ చేశాడు. దీంతో ఆ సంస్థ రెండు లక్షల కోట్ల వరకు నష్టపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ విలువ గడిచిన ఐదు రోజుల్లో 514 బిలియన్ డాలర్ల నుంచి.. 489 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2023లో నెట్ ఫ్లిక్స్ సంస్థ వివాదాస్పదమైన యానిమేటెడ్ సిరీస్ dead end: para normal Park ను రూపొందించింది. దానిని మధ్యలోనే నిలిపివేసింది. ఈ యానిమేటెడ్ సిరీస్ కు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే యుక్త వయసు ఉన్న పిల్లల్ని వేరే వైపు మళ్ళిస్తుందని.. దానివల్ల పిల్లలు తప్పుదోవ పడతారని మస్క్ ఆరోపించారు.. “మీ ఇంట్లో కౌమార పిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. నెట్ ఫ్లిక్స్ రూపొందించిన ఆ యానిమేటెడ్ సిరీస్ చూపించకండి. దానివల్ల పిల్లలు దారి తప్పే ప్రమాదం ఉంది. అది వాళ్లకు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని” మస్క్ పేర్కొన్నాడు. దీంతో నెట్ ఫ్లిక్స్ మీద తీవ్ర ఆరోపణలు రావడం మొదలైంది. ఫలితంగా ఆ సంస్థ ముఖ విలువ దారుణంగా పడిపోయింది. ఏకంగా రెండు లక్షల కోట్ల వరకు నష్టం జరిగిందంటే.. ఆ సంస్థకు ఎంత నష్టమో అర్థం చేసుకోవచ్చు.