Gautam Gambhir favourite: తిలక్ వర్మ ఇటీవల జరిగిన ఆసియా కప్ లో అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ అతడికి ఆస్ట్రేలియా జట్టుతో జరిగే టి20 సిరీస్ లో చోటు లభించలేదు..
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాను ముందుండి నడిపించాడు రోహిత్ శర్మ. ఏకంగా ట్రోఫీ కూడా అందించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్ ఇండియాను విజేతగా నిలిపాడు. అంతటి ఆటగాడిని సారధిగా తప్పించారు. సాధారణ ప్లేయర్ గా పరిమితం చేశారు.
మహమ్మద్ షమీ దేశవాళి క్రికెట్లో ఆదరగొట్టాడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయినప్పటికీ.. పదునైన బంతులు వేయడంలో అతడు సిద్ధహస్తుడు. ఆస్ట్రేలియా మీద అతడికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అయితే అటువంటి ప్లేయర్ ను ఎంపిక చేయలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆస్ట్రేలియా సిరీస్ కు ప్రకటించిన జట్టు విషయంలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన తప్పులు చాలా ఉన్నాయి. అయినప్పటికీ వాటికి మేనేజ్మెంట్ నుంచి మద్దతు లభిస్తోంది. పైగా గంభీర్ చెప్పిన వారికి జట్టులో చోటు దక్కుతోంది. వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టుతో జరిగే ప్రతిష్టాత్మకమైన సీరీస్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ ఎంపిక చేసిన జట్టు అత్యంత లోప భూయిష్టంగా ఉంది. ఇటువంటి జట్టు ఆస్ట్రేలియా మీద ఎలా గెలుస్తుంది.. ట్రోఫీలు ఎలా సాధిస్తుంది అనే విషయం గంభీర్ కే తెలియాలని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఆస్ట్రేలియా జట్టుతో జరిగే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు విషయంలో రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.. ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ కు అటు వన్డేలు, ఇటు టి20 లలో హర్షిత్ రాణా కు చోటు లభించింది. అసలు అతడికి స్థానం దక్కడాన్ని సీనియర్ ప్లేయర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇటీవల ఆసియా కప్ లో అతడు అంతగా ఆకట్టుకోలేదు. పరుగులు కూడా దారుణంగా ఇచ్చాడు. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో అయితే అనామకంగా బౌలింగ్ వేశాడు. అతని బౌలింగ్లో శ్రీలంక బ్యాటర్లు పరుగుల ప్రవాహాన్ని సాగించారు. అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న అతడిని ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపిక చేయడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే విషయాన్ని శ్రీకాంత్ ప్రముఖంగా ప్రస్తావించారు. “హర్షిత్ టీమ్ ఇండియాలో శాశ్వత ఆటగాడు. ఎందుకంటే అతడు గౌతమ్ గంభీర్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తి. గిల్ తర్వాత అతనే ఉంటాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం తయారు చేసుకోవాలి. ఒకవేళ ఆ జట్టులో హర్షిత్, నితీష్ కుమార్ రెడ్డి గనుక ఉండి ఉంటే కచ్చితంగా ట్రోఫీ మీద ఆశలు వదిలేసుకోవాలని” శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. కోచ్ గా గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయని శ్రీకాంత్ ఆరోపించాడు.
Legendary Cricketer Krishnamachari Srikkanth Explains How HARSHIT RANA Gets His Spot In All Format. #BCCI #RohitSharma #ViratKohli #IndianCricket pic.twitter.com/Vh6BWIC140
— surendeRR singh (@Surende26790545) October 5, 2025