Israel vs HezBollah : ఇజ్రాయిల్ vs హెజ్ బొల్లా.. రణరంగంగా పశ్చిమాసియా.. క్షణం క్షణం భయం భయం.. యుద్ధం తప్పదా?

క్షణం క్షణం భయం భయం.. ఏ క్షిపణి మీద పడుతుందో తెలియదు. ఏ బాంబు పేలుతుందో ఎంతకీ అంత పట్టదు. ఇదీ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి.. దీంతో యుద్ధం తప్పదా? అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 28, 2024 10:17 pm

West Asia as battleground for Israel vs HezBollah war

Follow us on

Israel vs HezBollah : ఇజ్రాయిల్ దళాలు భీకర దాడులు చేస్తున్నాయి..హెజ్ బొల్లా ను కోలుకోకుండా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.. ఇప్పటికే హెజ్ బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ను హతమార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని హెజ్ బొల్లా అధికారికంగా ఇంతవరకూ ధృవీకరించలేదు. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం అంతకంతకు దూకుడు కొనసాగిస్తోంది. బాంబుదాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో హెజ్ బొల్లా కు పరోక్షంగా అండదండలు అందించిన ఇరాన్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇజ్రాయిల్ తో గత అనుభవాల నేపథ్యంలో ఇరాన్ తన సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..

బాంబుల వర్షం

అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. లెబ నాన్ రాజధాని బీ రూట్ లో హెజ్ బొల్లా ప్రధాన కార్యాలయం పై ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులలో హెజ్ బొల్లా చీఫ్ నస్రల్లా చనిపోయినట్టు తెలుస్తోంది.. దీనిని ఇజ్రాయిల్ రక్షణ విభాగం ఇప్పటికే ధ్రువీకరించింది. హెజ్ బొల్లా చీఫ్ ఆ సమయంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు ఇజ్రాయిల్ వర్గాలకు సమాచారం అందింది. దీంతో మరో మాటకు తావులేకుండా బాంబులతో దాడి చేసింది. బాంబుల దాడి వల్ల భవనం పూర్తిగా నేలమట్టం అయింది. ” మేము అనుకున్న లక్ష్యం పూర్తయింది. భవనం పూర్తిగా నేలమట్టం అయింది. నస్రల్లా ఇకపై భయభ్రాంతులకు గురి చేయడు. ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టలేడు.. అతడు ఇక గతం తాలూకు జ్ఞాపకమే” అంటూ ఇజ్రాయిల్ వార్ రూమ్ ప్రకటించింది..”ఆపరేషన్ న్యూ ఆర్డర్” మిషన్ విజయవంతమైన ప్రకటించింది..

వేగంగా మారుతున్న పరిణామాలు..

నస్రల్లా కన్నుమూసిన నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా హెజ్ బొల్లా తన మిత్రపక్షలతో అంతర్గత సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.. ఇజ్రాయిల్ వరుసగా దాడులు చేస్తున్న నేపథ ఖమేనీ అత్యవసరంగా తన నివాసంలో సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన ఒక సందేశం విడుదల చేశారు..”హెజ్ బొల్లా కు అండగా ఉండాలి. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి.. ఈ ప్రాంతం భవిష్యత్తును దూకుడుగా ఉన్నవారు నిర్ణయిస్తారు.. అందులో హెజ్ బొల్లా మొదటి స్థానంలో ఉంటుందని” ఖమేనీ తన సందేశంలో పేర్కొన్నారు.. కాగా, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో హెజ్ బొల్లా కు తీవ్ర నష్టం వాటిల్లుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయిల్ తో తలపడే అవకాశం కనిపిస్తోంది..లెబనాన్ కు తన దళాలను పంపిస్తోంది..”1981 మాదిరిగానే ఇజ్రాయిల్ దేశంతో నేరుగా పోరాడేందుకు తమ బలగాలను లెబ నాన్ కు పంపిస్తామని” ఇరాన్ ఉన్నతాధికారి అంతర్జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.