https://oktelugu.com/

Vladimir Putin: రష్యా అధ్యక్షుడిగా మళ్లీ అతనే.. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపు

బలమైన ప్రత్యర్థులు, పుతిన్‌ పాలసీలను వ్యతిరేకించేవారు లేకుండానే ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు ఆదివారం ముగిడయంతో వెంటనే కౌంటింగ్‌ ప్రారంభించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 18, 2024 / 02:47 PM IST

    Vladimir Putin

    Follow us on

    Vladimir Putin: రష్యా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ఎన్నికల్లో ఘన విజంయ సాధించారు. ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 88 శాతం ఓట్లు పోలయినట్లు తెలుస్తోంది.

    మూడు రోజులు పోలింగ్‌..
    రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మూడు రోజులపాటు జరిగింది. మార్చి 15న పోలింగ్‌ ప్రారంభమైంది. 17న పోలింగ్‌ ముగిసింది. చివరిరోజు పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నవారు, పుతిన్‌ విధానాలు నచ్చనివారు పోలింగ్‌ కేంద్రాలకు రావాలని ఇటీవలే అనుమానాస్పదంగా మృతిచెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో పోలింగ్‌ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

    పలుచోట్ల ఘర్షణలు..
    ఇదిలా ఉండగా ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్‌ పెట్టెల్లో ఇంకు పోశారు. దేశంలోని పలుప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్‌ నుంచి డ్రోన్లు రష్యావైపు దూసుకువచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ దాడులు చేసిందని రష్యా ఆరోపించింది. యూరప్‌ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తును రష్యా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

    పుతిన్‌కు.. భారీ మెజారిటీ
    అయితే బలమైన ప్రత్యర్థులు, పుతిన్‌ పాలసీలను వ్యతిరేకించేవారు లేకుండానే ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు ఆదివారం ముగిడయంతో వెంటనే కౌంటింగ్‌ ప్రారంభించారు. తొలి ఫలితంలో పుతిన్‌కు 88.7 శాతం ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు. దీంతో భారీ మెజారిటీతో పుతిన్‌ విజయం ఖాయమైంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

    మరో ఆరేళ్లు ఆయనే..
    పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా 1999 నుంచి కొనసాగుతున్నారు. తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుటిన్‌పై ముగ్గురు పోటీ చేశారు. కానీ, పుతిన్‌ మెజారిటీ రష్యన్లు మద్దతుగా నిలిచారు.