Homeఅంతర్జాతీయంIndian Visa Renewal :  వీసా రెన్యువల్ కు తంటాలు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలవేళ భారతీయులకు...

Indian Visa Renewal :  వీసా రెన్యువల్ కు తంటాలు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలవేళ భారతీయులకు కొత్త తిప్పలు

Indian Visa Renewal :  అమెరికాలో ఉద్యోగాల కోసం హెచ్‌1బీ వీసాలపై వెళ్లిన భారతీయులు ప్రస్తుతం అగ్రరాజ్యంలో ఇబ్బంది పడుతున్నారు. వీసా లేకుండా అమెరికాలో ఉండడం కుదరదు. వీసా రావడానికి కూడా ఓ యుద్ధమే చేయాలి. అంత ఈజీగా ఈ వీసా దొరకదు. అది దక్కిన తర్వాతనే అమెరికాలో అడుగు పెట్టే అవకాశం దక్కుతుంది. అయితే ఈ వీసా జీవితకాలానికి ఇవ్వరు. పరిమిత కాలంలో జారీ చేస్తారు. గడువు ముగిసే సమయంలో రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే అక్రమంగా ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఇక వీసా దక్కించుకోవడానికి పడినట్లుగానే.. ఇప్పుడు రెన్యూవల్‌ కోసం కూడా భారతీయులు తిప్పలు పడుతున్నారు. అక్కడి పరిస్థితుల గురించి ఓ ఎన్నారై సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. వీసా రెన్యూవల్‌ కష్టాలను పీడకలగా పేర్కొంటూ రెడిట్‌లో తన బాధను వెల్లడించాడు.

వీసా కోసం ముప్పు తిప్పలు..
అమెరికా వెళ్లేందుకు వర్క్‌ వీసా(హెచ్‌1బీ) కోసం ముప్పు తిప్పలు పడుతుంటారు భారతీయులు. ఇటీవల అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరగడంతో అమెరికా కూడా ఏటా హెచ్‌1బీ వీసాలను పెంచుతోంది. అయినా చాలా మందికి వీసా రావడం లేదు. దీంతో మళ్లీ మళ్లీ ప్రకయత్నిస్తున్నారు. కొందరు అడ్డదారిలో వీసా కోసం ప్రయత్నిస్తుంటారు. ఎలా వీసా పొందినా అవి పరిమిత కాలానికి మాత్రమే జారీ చేస్తారు. తర్వాత రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఓ ఇండో అమెరికన్‌ తాను పడుతున్న కష్టాలను వెల్లడించాడు.‘నెల రోజులుగా హెచ్‌1బీ డ్రాబాక్స్‌ వీసా స్లాట్ల కోసం వెతుకుతునాన. నవంబర్‌లోపు స్టాంప్‌ వేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాలి. కానీ, డ్రాప్‌బాక్స్‌ వీసా స్లాట్‌ దొరకడం లేదు. దారికేలా కనబడడం లేదు. ఈ పరిస్థితి నన్ను ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రెన్యూవల్‌ స్లాట్‌ కోసం ఆశగా ఎదురు చూస్తున్నా. నాలాగే ఎవరైనా ఉంటే ఇప్పుడు ఏం ఏయాలో చెప్పాలని కోరాడు.

స్లాట్‌ విడుదల కాక..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బిజీలో ఉన్న అధికారులు వీసా రెన్యూవల్‌ స్లాట్‌ విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ఎన్నారై.. తాము చెకోర పక్షుల్లా వీసా రెన్యూవల్‌ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నాడు. తాను ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను. నవంబర్‌ లేదా డిసెంబర్‌ స్లాట్‌ కోసం ఎదరు చూస్తున్నాను కానీ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఎలాగైనా ఇండియా వెళ్లాలి డ్రాప్‌బాక్స్‌ వీసా స్లాట్‌ త్వరలో విడుదలవుతాయని ఆశిస్తున్నా అని మరొకరు తెలిపారు.

ఆగస్టు నుంచి నిరీక్షణ..
హెచ్‌1బీ వీసాల రెన్యూవల్‌ కోసం చాలా మంది ఆగస్టు నుంచి ఎదురు చూస్తున్నారు. నవంబర్, డిసెంబర్‌ స్లాట్లను జూలైలో తెరిచారు. మరికొన్ని స్లాట్‌ కూడా త్వరలో విడుదలవుతాయి. కానీ స్లాట్‌ దొరకడం కష్టంగా మారింది అని మరో ఎన్నారై తెలిపాడు. డ్రాప్‌ బాక్స్‌ వీసా స్లాట్‌ గ్యారంటీ లేకపోవడంతో తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోలేకపోతున్నామని వాపోయారు.

డ్రాప్‌ బాక్స్‌ స్కీం అంటే..
డ్రాప్‌ బాక్స్‌ స్కీమ్‌ ప్రకారం.. దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరు కాకుండా వీసా పునరుద్ధరణ కోసం అప్లయ్‌ చేసుకోవచ్చు. భారతీయులు సమర్పించే పత్రాలను చెన్నైలోని యూఎస్‌ కాన్సులేట్‌ ప్రాసెస్‌ చేస్తుంది. రెన్యూవల్‌ కోసం దరఖాస్తు దారులు తమ డ్రాప్‌ బాక్స్‌ పాయింట్మెంట్ల కోసం ఇండియాకు తిరిగి వెలల్లాల్సి ఉంటుంది. యూఎస్‌ కాన్సులేట్‌ కేవలం 2 రోజుల ముందు స్లాట్లు విడుదల చేస్తోంది. దీంతో చాలా మంది స్లాట్‌ దొరకక ఇబ్బంది పడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular