Bearded woman : గడ్డమే ఆమెకు అందం.. అంత పొడువు పెంచేసి గిన్నిస్ లోకి.. ఎవరీమె.. ఏంటి గడ్డం కథ?

అమెరికాకు చెందిన ఎరిన్ హనీకట్ అనే మహిళ గడ్డం పెంచుతోంది. పెంచడం అంటే అలా ఇలా కాదు ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించేలా పెంచింది. చివరకు .

Written By: NARESH, Updated On : August 13, 2023 12:12 pm
Follow us on

Bearded woman : మీసాలు, గడ్డం మగాడికి అందం అంటారు. ఆ గడ్డాన్ని పెంచుకునేందుకు చాలా మంది ఇష్టపడతారు. డిఫరెంట్ షేప్స్, డిజైన్స్ తో గడ్డం పెంచుకునేందుకు పోటీపడతారు. ఇంకా కొంతమంది పొడవుగా పెంచుకుంటూ ఉంటారు. ఇది సాధారణమే.. ప్రకృతి సిద్ధమే. కానీ ఇక్కడ అసాధారణంగా ఓ మహిళకు గడ్డం వచ్చింది. రావడమే కాకుండా ఆమె ఆ గడ్డాన్ని పెంచుకుంటూనే పోతోంది. ఎంతలా పెంచిందంటే ఏకంగా ఆమె గడ్డానికి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇంతకీ ఎవరా మహిళ. ఎలా పెంచుతోంది. ఆమె గడ్డం ఎంత పొడవు ఉందో తెలుసుకుందాం.

జాగ్రత్తగా పెంచుతోంది..
అమెరికాకు చెందిన ఎరిన్ హనీకట్ అనే మహిళ గడ్డం పెంచుతోంది. పెంచడం అంటే అలా ఇలా కాదు ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించేలా పెంచింది. చివరకు . అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా ఏకంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. తొలుత అవాంఛిత రోమాలను తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గడ్డం పెంచింది. ఇప్పుడు అది కాస్త వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ప్రస్తుతం ఆమె గడ్డం పొడవు 11.8 అంగుళాలు. దీంతో గతంలో అమెరికాకు చెందిన వివాన్ వీలర్ అనే మహిళ 10.04 అంగుళాలు పెంచి సాధించిన గిన్నిస్ రికార్డును అధిగమించి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది.

జన్యు పరమైన సమస్యలు..
అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హనీకట్‌కు చిన్నతనం నుంచి జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ కారణంగా ఆమెకు 13 ఏళ్ల వయసు వచ్చేసరికి క్రమంగా గడ్డం రావడం ప్రారంభమైంది. దీంతో ఆమె తీవ్ర అవమానంగా భావించింది. తర్వాత ఆ గడ్డాన్ని తొలగించేందుకు రోజుకు మూడు నుంచి 4 సార్లు షేవింగ్ చేసుకునేంది. అయినప్పటికీ తగ్గకపోవడంతో అవాంఛిత రోమాలను తొలగించుకునేందుకు రకరకాల మెడిసిన్లు, ఆయిల్స్, మందులు వాడింది. హెయిర్ రిమూవల్స్ కూడా చాలా ఉపయోగించినా ఫలితం లేదు.

గడ్డం తొలగించడం ఆపేసింది..
కొన్నేళ్ల తర్వాత ఎరిన్ హనీకట్‌కు హైబీపీతోపాటు ఐ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆమెకు పాక్షికంగా దృష్టి లోపం తలెత్తింది. ఈ పరిణామాలతో ఆమె తన గడ్డాన్ని తొలగించే పనులను పూర్తిగా ఆపేసింది. ఇక గడ్డం పెరిగితే పెరగనీ అని వదిలేసింది. దీంతో ఆమె మానసికంగా తీవ్రంగా కుంగిపోయింది. కొన్ని కొన్ని సమయాల్లో హనీకట్.. ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడేది. కొన్నేళ్ల పాటు ఇంట్లోనే ఉంటూ తీవ్ర నరకం అనుభవించింది. ఆమె పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తెలిసినవారు హనీకట్‌కు ధైర్యం చెప్పేవారు. గడ్డం ఉంటే తప్పేంటని.. తాను అందంగా ఉందని ఆమెలో ఆత్మవిశ్వాసం నింపేవారు. దీంతో ఆమెలో కొంత ధైర్యం వచ్చి.. నిర్భయంగా బయటికి రావడం ప్రారంభించింది. ఆ ధైర్యమే ఈ రోజు హనీకట్ పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడానికి ఉపయోగపపడింది.

కాలు కోల్పోయిన హనీకట్..
ఓ వైపు హనీకట్‌ను జన్యుపరమైన సమస్యలు వేధిస్తుంటే.. మరోవైపు ఆమెకు బాక్టీరియా సోకింది. దీంతో ఆమె ఒక కాలును కోల్పోవాల్సి వచ్చింది. అప్పటికే గడ్డం వచ్చిందని కుమిలిపోతున్న హనీకట్‌కు.. మరో తీరని ఆవేదన కలిగింది. సామాజికంగా ఎన్నో అడ్డంకులు ఎదురైనా.. వాటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా దృఢ మనస్తత్వంతో ఆమె ముందుకు అడుగేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నాటికి ఆమె గడ్డం ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం ఉన్న మహిళ గడ్డాన్ని దాటింది. దీంతో ఆమెను గిన్నిస్‌ రికార్డు సాధించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే ఆగస్టు 9 వ తేదీన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు.