US sanctions on Russia: ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని రష్యా ఏ మాత్రం ఆపడం లేదు. పైగా మరింత దూకుడుగా వెళ్తోంది. ఇది అమెరికాకు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికా రష్యా మీద అనేక రకాలుగా ఆంక్షలు విధించింది. ఇంకా ఇంకా అనేక రూపాలలో ఆంక్షలు విధించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. అంతేకాదు రష్యాకు ఆయువు పట్టు లాగా ఉన్న చమురు మీద అమెరికా దెబ్బకొట్టింది. రష్యా ప్రధానంగా చమురును భారతదేశానికి ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాల మీద భారత దృష్టి సారించింది.
అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ కరేబియన్ దేశమైన గయానా నుంచి చమురు కొనుగోడు చేస్తోంది. 17700 కిలోమీటర్ల దూరం నుంచి ఆయిల్ ట్యాంకర్లు మన దేశానికి వస్తున్నాయి రెండు సూపర్ ట్యాంకర్లు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించాయి. ఒక్కో ట్యాంకర్ల రెండు మిలియన్ బ్యారెల్స్ చొప్పున ఆయిల్ ఉంది. జనవరి నాటికి అవి ఇక్కడికి చేరుకుంటాయని తెలుస్తోంది. గయానా నుంచి వస్తున్న చమురుకు భారత్ ఎంత ఖర్చు పెడుతుందనే విషయం బయటికి రాలేదు.
జనవరి లో మనదేశంలోకి చమురు దిగుమతి అవుతుంది. ఆ తర్వాత దేశీయ అవసరాలకు అనుగుణంగా చమురును శుద్ధి చేస్తారు. ఆ తర్వాత వివిధ అవసరాల నిమిత్తం పంపిణీ చేస్తారు. ఒక దేశ ఆర్థిక రంగాన్ని చమురు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ధరలు పెరిగినప్పుడు దేశీయ అవసరాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఆర్థిక వ్యవస్థలు కూడా కుదుపులకు గురవుతాయి. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం వల్ల చమురు ధరలు చాలా వరకు తగ్గాయి. దీంతో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు స్థిమితంగా ఉన్నాయి. ఒకవేళ ఆ ధరలు గనుక పెరిగితే పరిస్థితి మరో విధంగా ఉండేది.
గతంలో అరబ్ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేసేది. కొంతకాలంగా రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. అమెరికా అడ్డదిడ్డమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయంగా గయానా ప్రాంతం నుంచి చమురు కొనుగోలు చేయడం విశేషం. దీనివల్ల మనదేశంలో ఇంధనం ధరలు స్థిరంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ తక్కువ ధరకు చమురు లభిస్తుందో.. అక్కడికి వెళ్లి భారత్ కొనుగోలు చేస్తోంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా ఖర్చు కాకుండా చూసుకుంటున్నది.