https://oktelugu.com/

Donald Trump : అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త బిజినెస్.. త్వరపడండి

డొనాల్డ్ ట్రంప్ కావాలని కొందరు కోరుకుంటే మరికొందరు ఈయన గెలుపును అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ట్రంప్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయ్యారు. మొత్తం మీద ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ మరో బిజినెస్ ప్రారంభించారట. మరి దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 24, 2024 / 07:15 AM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump : 130 ఏళ్లలో వైట్ హౌస్‌లోకి అడుగు పెడుతున్న 78 ఏళ్ల మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ మరో రికార్డు సృష్టించారనే చెప్పాలి. ఈయన గెలుపుతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో వంటి ఎందరో వివిధ దేశాల అధినేతలు డోనల్డ్ ట్రంప్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈయన కావాలని కొందరు కోరుకుంటే మరికొందరు ఈయన గెలుపును అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ట్రంప్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయ్యారు. మొత్తం మీద ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ మరో బిజినెస్ ప్రారంభించారట. మరి దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

    అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన కొత్త బిజినెస్ ప్రారంభించారు. అయితే ఈ అమెరికా అధ్యక్షుడు ఎలక్ట్రిక్‌ గిటార్‌ ల వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఈ గిటార్‌లను ఎంతో ప్రత్యేకంగా రూపొందించారని టాక్. మరీ ముఖ్యంగా ఈ గిటార్‌లో అమెరికా జెండా, ఈగల్‌ బొమ్మలు ఉన్నాయి. ఇవి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్’ అనే స్లోగన్‌ను ముత్యాలతో రాసి మరీ ఈ గిటార్ లను తయారు చేశారు. ఇక్కడతో మాత్రమే ఆగిపోలేదు. గిటార్‌లోని 45 నంబరు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ను సూచిస్తుంది ఈ గిటార్. ఇక ఆ గిటార్లలో కొన్నింటిపై ట్రంప్‌ సంతకం చేసిన గిటార్లు కూడా ఉండటం విశేషం. ట్రూత్‌ సోషల్‌ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాపారాన్ని ప్రకటించారు.

    ఈ బిజినెస్ కు సంబంధించిన పూర్తి వివరాలను ట్రంప్‌ గిటార్స్‌ వెబ్‌సైట్ వెల్లడించింది. మొత్తం 1,300 గిటార్లు అమ్ముతున్నారట. అందులో దాదాపు వెయ్యికి పైగా గిటార్లు సాధారణమైనవి.వీటి ధర 1,250 డాలర్ల నుంచి 1,500 డాలర్లకు ఉంటుంది. ఇక ట్రంప్‌ ఆటోగ్రాఫ్‌తో కూడిన ఎలక్ట్రిక్‌ గిటార్లకు మాత్రం ఎక్కువ ధర ఉంది. ఈ అమెరికా అధ్యక్షుడి సంతకం ఉన్న గిటార్ల ధర10వేల డాలర్లు (రూ.8.45లక్షలు)గా ప్రకటించారు.. అయితే, అవి కేవలం 275 మాత్రమే ఉండటం విశేషం.

    ఈ స్పెషల్ గిటార్‌ని సొంతం చేసుకోవాలంటే 10 వేల డాలర్లు పెట్టాలి. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 8.45లక్షలు పెట్టి కొనుగోలు చేయాలి అన్నమాట. మొత్తం నాలుగు రకాల గిటార్లను విక్రయిస్తామని ‘ట్రంప్ గిటార్స్’ వెబ్‌సైట్ తెలపడంతో కొందరు వెయిట్ చేస్తున్నారు. ఇక ఇందులోని 45 నెంబర నూతన అధ్యక్షుడైన ట్రంప్ ను సూచిస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ట్రంప్ సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన చిత్రాన్ని ముద్రించిన usd 100 వెండి నాణాలను కూడా విక్రయించారు ట్రంప్. అంతేకాదు ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈయన గాడ్ బ్లెస్ ది యూఏఎస్ బైబిల్ అనే పుస్తకాలు, స్నీకర్ కాన్ అనే కొత్త ట్రంప్ బ్రాండెడ్ స్పీకర్లు ట్రంప్ వాచ్ కలెక్షన్లు అంటూ వజ్రాలు పొదిగిన వాచ్ లను కూడా అమ్మారు ట్రంప్. ఇక అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ఈ కొత్త బిజినెస్ మొదలు పెట్టారు అమెరికా అధ్యక్షుడు.