https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశులపై శుక్రుడి సంచారం.. వీరు ఏది అనుకున్నా జరుగుతుంది..

ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. అయితే పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 24, 2024 / 08:10 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: .జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం కొన్ని రాశుల వారికి శుక్ర గ్రహం కలిసి రానుంది. దీంతో ఈ రాశుల వ్యాపారులను అన్నీ అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఆచితూచి వ్యవహరించాలి. లేకుంటే తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. అయితే పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

    వృషభరాశి:
    ఈ రాశి వారికి ఆర్థికంగా అన్నీ అనుకూలిస్తాయి. అయితే వ్యాపారులు భాగస్వాముల మధ్య కొన్ని ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం ఖర్చులు చేస్తారు. ఉద్యోగులు తోటి వారితో ఉల్లాసంగా ఉంటారు.

    మిథున రాశి:
    ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లో తలదూర్చొద్దు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    కర్కాటక రాశి:
    వ్యాపారులు భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త పెట్టుబడులు పెడుతారు. అయితే తోటి వారి సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులు కొన్ని లక్ష్యాలను సాధిస్తారు. దీంతో ప్రమోషన్ పొందే అవకాశం. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    సింహా రాశి:
    ఉద్యోగులు తోటి సిబ్బంది నుంచి ప్రతికూల వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆచితూచి అడుగేయాలి. కుటుంబంలో కొందరు సమస్యలు సృస్టిస్తారు. ఇలాంటి వారితో చాకచక్యంగా వ్యవహరించాలి. మానసికంగా ఆందోళనతో ఉంటారు.

    కన్యరాశి:
    ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుది. ఇవి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇన్నాళ్లూదూరమైన వ్యక్తులు ఇప్పుడు వీరి వెంటే ఉంటారు.

    తుల రాశి:
    కొన్ని పనులు ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుంది. లేకుంటే నష్టాల పాలవుతారు. కుటుంబంలో ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థుల నుంచి తల్లిదండ్రులు ఓ శుభవార్త వింటారు. కోపాన్ని తగ్గించుకోవాలి. లేకుంటే మానసికంగా ఆందోళనకు గురవుతారు.

    వృశ్చిక రాశి:
    ఈ రాశి వ్యాపారులు తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సలహాతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    ధనస్సు రాశి:
    శుక్రబలం ఎక్కువగా ఉండడంతో వీరికి సంపద పెరుగుతుంది. కొందరు సహనాన్ని పరీక్షిస్తారు. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్లాలి. అప్పుడే అనుకున్న ఆదాయం పొందగలుగుతారు.

    మకర రాశి:
    కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. దీంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారం కావడంతో ఆనందంగా ఉంటారు.

    కుంభ రాశి:
    కొన్ని పనుల నిమిత్తం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగులకు ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం అవసరం.

    మీనరాశి:
    ఉద్యోగులు విధులు నిర్వహించేటప్పుడు శ్రద్ధ వహించాలి. ఏకాగ్రత లోపించి పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు. వ్యాపారులు కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఏర్పడుతుంది.