Homeఅంతర్జాతీయంUS Foreign Policy Mistakes Middle East Analysis: అమెరికా తప్పులే ఆ దేశాలకు బలం.....

US Foreign Policy Mistakes Middle East Analysis: అమెరికా తప్పులే ఆ దేశాలకు బలం.. నెపోలియన్‌ సూత్రం ఒంటపట్టించుకున్న చైనా, రష్యా!

US Foreign Policy Mistakes Middle East Analysis: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేశాయి. సుమారు 40 రోజులు సాగిన యుద్ధంలో ఇరాన్‌ ఎక్కడా తలొగ్గలేదు. సుప్రీం లీడర్‌తోపాటు కీలక నేతలు, అధికారులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా ఇరాన్‌ మాత్రం ప్రతిదాడులతో అమెరికా, ఇజ్రాయెల్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీంతో అమెరికా డైలమాలో పడింది. ఇప్పుడు శాంతి చర్చల పేరుతో రెండు వారాల సీజ్‌ఫైర్‌ కుదుర్చుకుంది. ఇక ఈ యుద్ధానికి రష్యా, చైనా వ్యూహాత్మకంగా దూరంగా ఉంటున్నాయి. ‘శత్రువు తప్పు చేస్తున్నప్పుడు ఎప్పుడూ అడ్డుపడకు‘ అన్న
ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనపార్ట్‌ మాటలను పూర్తిగా ఆచరిస్తున్నాయి. ఇరాన్‌కు పరోక్షంగా సాయం చేస్తూనే, పశ్చిమాసియాలో అమెరికా తప్పుల నుంచి భారీ లాభాలు పొందుతున్నాయి.

పశ్చిమాసియాలో తగ్గిన అమెరికా ప్రాబల్యం..
పశ్చిమాసియాలో అమెరికా పలుకుబడిని పెంచుకోవడానికి దశాబ్దాలుగా కష్టపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యా ప్రభావాన్ని పరిమితం చేసి, 2020 నాటికి చైనాను కూడా నిలువరించింది. ఖతార్, యూఏఈ, బహ్రెయిన్‌లతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ ఇటీవల చైనా, రష్యా వ్యూహాత్మక చర్యలతో ఈ ప్రాబల్యం క్షీణించింది. సిరియా అంతర్యుద్ధంలో బషర్‌ అసద్‌కు మద్దతు ఇచ్చి రష్యా ఇరాన్‌కు దగ్గరైంది. 2023లో సౌదీ అరేబియా–ఇరాన్‌ మధ్య దౌత్య సయోధ్య కుదిర్చి చైనా తన ప్రభావాన్ని చాటుకుంది. గల్ఫ్‌ దేశాలు అమెరికాపై విశ్వసనీయత కోల్పోయి, ఆర్థిక సహకారానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి.

మారిన వ్యూహాలు..
ఇరాక్, ఆఫ్గానిస్తాన్‌ యుద్ధాల్లో అమెరికా వైఫల్యాలు రష్యా, చైనాకు మేలు చేశాయి. అమెరికా ఆస్తులు, వ్యూహాలు మార్చుకుంటున్న సమయంలో ఈ రెండు దేశాలు పశ్చిమాసియాలో ప్రభావాన్ని విస్తరించుకున్నాయి. ఇజ్రాయెల్‌తో కలిసి టెహ్రాన్‌పై యుద్ధానికి దిగడం, గ్రీన్‌లాండ్, నాటోపై బెదిరింపులు మిత్రదేశాలతో అమెరికా సంబంధాలను బీటలు వార్చాయి. ఈ విభేదాలను చైనా, రష్యా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.

ఆర్థిక పతనం..
యుద్ధ రంగంలోకి దిగడం అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసింది. పెరిగిన చమురు ధరలు, ఆంక్షల సడలింపులు రష్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో ఒత్తిడి ఎదుర్కొన్న మాస్కోకు కాసుల వర్షం కురిసింది. హర్మూజ్‌ మూసివేత చైనాను దెబ్బతీసినా, దేశీయ చమురు నిల్వలు పెంచుకోవడం, సౌరశక్తి, బ్యాటరీలు, బొగ్గు వనరులను వైవిధ్యపరచడం ద్వారా చైనా ఆర్థికంగా మెరుగైంది.

ట్రంప్‌ ధోరణి..
చర్చలతో తేల్చుకోకుండా ట్రంప్‌ యుద్ధానికి కాలుదువ్వడం, మాటలు మార్చడం అమెరికా పరపతిని బలహీనపరిచాయి. ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్నంత కాలం అస్థిర ధోరణి బీజింగ్‌కు ప్రభావం పెంచుకునే అవకాశం ఇచ్చింది. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం వహించిన 14 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరాన్‌ను ఒప్పించింది చైనాయే. గతంలో ఇరాన్‌–సౌదీ, రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌–పాలస్తీనా చర్చల్లో చైనా కీలక పాత్ర పోషించింది.

ఈ నాలుగు తప్పులు అమెరికాను అగ్రరాజ్య రేసులో బలహీనపరుస్తున్నాయి. చైనా, రష్యా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే, పశ్చిమాసియాలో కొత్త శక్తి సమతుల్యత ఏర్పడుతోంది. ట్రంప్‌ ధోరణి మారకపోతే, అమెరికా మరింత ఒంటరి అవుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version