US daring military operations: మీకు గుర్తుందా.. ప్రపంచ వాణిజ్య సముదాయం పై లాడెన్ నేతృత్వంలోని ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. అప్పట్లో అమెరికా ఈ దాడితో వణికిపోయింది. ఆ తర్వాత ఉగ్రవాదుల మీదకి దాడికి దిగింది. ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని సంవత్సరాలపాటు తన పరిపాలన సాగించింది. విలువైన వనరులు.. ఖనిజాలను దోచుకున్న తర్వాత ఆఫ్గనిస్తాన్ దేశం నుంచి బయటికి వచ్చింది.
ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. అమెరికా చేసిన దురాగతాలు.. దుర్మార్గాలు చాలా ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే అమెరికా అనేది సైతాన్ దేశం. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. ఎవరినైనా మట్టపెడుతుంది. తన అవసరాల కోసం లాడెన్ అనే ఉగ్రవాదిని పెంచి పోషించిన అమెరికా.. అవసరం తీరిన తర్వాత అతడిని అంతం చేసింది.. ఏకంగా పాకిస్తాన్లో దాచుకుంటున్న అతడిని మట్టుపెట్టింది. పాకిస్తాన్ దేశానికి తెలియకుండానే యుద్ధ విమానాలను మోహరించి చంపేసింది. అతడి మృతదేహాన్ని అమెరికా తీసుకెళ్లి.. అక్కడి సముద్రంలో పడేసింది.
అమెరికాలో ఇటువంటి ఆపరేషన్ లను సీక్రెట్ కమాండో బృందం చేస్తూ ఉంటుంది. దానికి సీల్ టీమ్ 6 అని పేరు.. ఈ బృందాన్ని అమెరికా ఐదు దశాబ్దల క్రితం ఏర్పాటు చేసింది. అప్పట్లో ఇరాన్ దేశంలో విపరీతమైన ఆందోళనలు చోటుచేసుకున్నాయి. నాటి ఘటనలో 50 మందికి పైగా అమెరికా ఎంబసీ సిబ్బందిని.. ఇతర పౌరులను ఇరాన్ రెవల్యూషనరీ నాయకులు పట్టుకున్నారు. వారిని కాపాడేందుకు అమెరికా తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. ఏకంగా ఆపరేషన్ ఈగల్ క్లా అనే పేరుతో చిన్నపాటి యుద్ధం చేసింది. అయితే ఆపరేషన్ విఫలమైంది. ఇది కాస్త అమెరికాకు ఎదురుదెబ్బ లాగా నిలిచింది. నాడు చేపట్టిన ఆపరేషన్ లో హెలికాప్టర్, సి 130 రవాణా విమానం పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన ఎనిమిది మంది ఆర్మీ సిబ్బంది చనిపోయారు. ఫలితంగా ఆపరేషన్ విజయవంతం కాలేదు. అయితే పట్టుకున్న ఆ బందీలను ఇరాన్ ఏడాది పాటు తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆపరేషన్ ఫెయిల్ కావడంతో అమెరికా దౌత్య చర్చలు జరిపింది. వారిని విడిపించుకుంది.
ఈ పరిణామం తర్వాత బందీల కోసం ప్రత్యేకమైన ఆపరేషన్లు చేపట్టాలని.. దీనికోసం ఒక యూనిట్ ఏర్పాటు చేయాలని అమెరికా నాడు నిర్ణయించింది. ఈ బాధ్యతను నాటి నేవీ కమాండర్ రిచర్డ్ మార్సింకో కు అప్పగించింది.. అతడు రూపొందించిన సీల్ టీమ్ 6.
సీల్ టీమ్ 6 2011లో పాకిస్తాన్లో తలదాచుకున్న బిన్ లాడెన్ అనే ఉగ్రవాదిని అంతం చేసింది. నాటి ఆపరేషన్ లో 24 మంది కమాండోలు సీక్రెట్ గా పాకిస్థాన్ లో ప్రవేశించారు. లాడెన్ ను అంతం చేశారు. ఈ ఘటన కంటే ముందు 2009లో అమెరికా కెప్టెన్ ఫిలిప్స్ అనే వ్యక్తిని సోమాలియా దొంగలు నిర్బంధించారు. వారి వద్ద నుంచి అతడిని సీల్ టీమ్ 6 బృందం కాపాడింది.. ఇప్పుడు ఇరాన్ లో బందీగా ఉన్న తమ అధికారిని సీల్ టీమ్ 6 బృందం రక్షించుకుంది.
గడిచిన వారం అమెరికాకు చెందిన 15 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. అందులో ఒక పైలట్.. వెపన్స్ సిస్టం ఆఫీసర్ ఉన్నారు. ఈ ఘటనలో పైలట్ ను అమెరికా కాపాడుతుంది. వెపన్స్ ఆఫీసర్ మాత్రం కనిపించలేదు.. ఆ ఆఫీసర్ ఇరాన్ దళాలకు చిక్కకుండా ఒక కొండపైకి చేరుకున్నాడు. అక్కడ దాక్కున్నాడు. అయితే అతడిని సిఐఏ సహాయంతో గుర్తించిన సీల్ టీమ్ 6.. అత్యంత భీకరమైన కాల్పుల మధ్య అతడిని కాపాడింది. ప్రాణాలతో బయటకు తీసుకొచ్చింది.