US Attack On Iran: ఇరాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో 20 రోజులుగా దేశ ప్రజలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. వీటికి అమెరికా మద్దతు తెలుపుతోంది. మరోవైపు నిరసనలను ఇరాన్ అణచివేస్తోంది. ఇప్పటికే 2 వేల మందికిపైగా మరణించారు. ఈ క్రమంలో అమెరికా ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోంది. అయితే దాడి తీవ్రతపై ఇంకా స్పష్టత లేదు. ఖతార్‌లోని అల్–ఉదెయిద్ వైమానిక బేస్‌తో పాటు పలు ప్రాంతీయ స్థావరాల నుంచి సిబ్బందిని ఆపాద్ చేస్తోంది అమెరికా. ఇరాన్ రక్షణ చర్యలు చేపట్టింది. భారత్,బ్రిటన్ తమ దేశ పౌరులను వెనక్కి రావాలని సూచించాయి.
నిరసనల్లో 2,571 మంది మృతి..
ఆందోళనల సమయంలో మృతుల సంఖ్య 2,571కి చేరింది. ప్రజలు భయంతో రాత్రులు గడుపుతున్నారు. భద్రతా సిబ్బందిలోని సుమారు 100 మందికి సామూహిక అంత్యక్రియలు జరిగాయి. నిరసనకారులపై ఇరాన్ చర్యలు తప్పుబట్టి ట్రంప్ మానవత్వం చూపాలని కోరారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జాతీయ భద్రతా సమావేశాల్లో ఇరాన్ వ్యూహాలు చర్చించారు.
ఇరాన్ అలర్ట్..
ఇరాన్ జ్యుడీషియరీ ప్రధాని ఘోలామ్ హుసేన్ మొహ్సెనీ–ఎజీ, ఆందోళనకారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలస్యం వల్ల ప్రభావం తగ్గుతుందని అన్నారు. మరణశిక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది టెహ్రాన్. మరోవైపు ఇంటర్నెట్ బ్లాక్ చేసిన ఇరాన్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఉచిత సేవలు అందిస్తోంది. ఉపగ్రహాల ద్వారా పౌరులు బయటి ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నారు.
ఇరాన్‌కు వెళ్లొద్దు..
పరిస్థితులు తీవ్రతరం కావడంతో భారత్ తన పౌరులకు ఇరాన్ వదిలి వెళ్లాలని సూచించింది. కొత్తగా ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది. అక్కడ 10 వేల మందికిపైగా భారతీయులు ఉన్నారు.