Unknown Gunmen Pakistan: పాకిస్తాన్ ప్రాంతాల్లో హెల్మెట్లు ధరించి మోటార్‌సైకిళ్లపై తిరిగే అజ్ఞాత సాయుధులు భారత వ్యతిరేక ఉగ్రవాద మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత నవంబర్ నుంచి జనవరి మొదటి రెండు వారాల్లో 75 రోజుల్లో వంద మందిని అంతం చేశారు. ఈ టార్గెట్లు గ్రౌండ్ స్థాయి మధ్యవర్తులు, లాజిస్టిక్ సరఫరాదారులు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ 140 మందికి రక్షణ అందిస్తున్నప్పటికీ, ఈ దాడులు డబ్బు, ఆయుధాలు, ఆశ్రయాల సరఫరాను భంగపరిచాయి.
జనవరిలో ఐదుగురు హతం..
ఈ సాయుధులు ఉగ్రవాద నాయకులు, గ్రౌండ్ వర్కర్ల మధ్య లింక్‌లను కట్ చేస్తున్నారు. తాజాగా జనవరిలో ఇప్పటి వరకు ఐదుగురిని లేపేశారు.
అబూ అమ్జాదీ..
జైష్–ఏ–మహ్మద్‌కు లాజిస్టిక్, మీడియా మేనేజ్‌మెంట్ చేస్తూ జమ్మూ యాత్రీ దాడి కుట్రలు రచించాడు. ఇటీవల మురీద్కేలో అతడిని అజ్ఞాత సాయుధులు లేపేశారు.
తారిక్ సాకిబ్..
ఉగ్రవాదుల రవాణా, ఆశ్రయాలు నిర్వహించాడు. ఇతడి గురించి తెలిసిన అజ్ఞాత సాయుధులు జనవరి 12న కోట్లిలో లేపేశారు.
ఉమర్ కశ్మీరీ..
భారత మూలాలున్న నెట్‌వర్క్ నిపుణుడు ఉమర్ కశ్మీరీ. ఇతడు నెట్‌వర్క్ లేనిచోట కూడా ఉవ్రాదులకు సహాయం అందించారు. కమ్యూనికేషన్ బ్లాక్ చేయడానికి టార్గెట్ అయ్యాడు.
గుర్తుతెలియని ఉగ్రవాది..
ఇక ఒక గుర్తుతెలియని ఉగ్రవాదిని కూడా సాయుధులు లేపేశారు. ఖైబర్ పక్తూంక్వా వెళ్తుండగా డేరా గాజీఖాన్ వద్ద మాయమయ్యాడు. తర్వాత హతమయ్యాడు.
ఎడిటర్ బాబా..
ఇతను ఉగ్రవాదులకు మీడియా సపోర్ట్ అందించాడు. చాలాకాలంగా ఉవ్రాదులకు సహకారం అందిస్తున్నాడు. ఇతడిని గుర్తించిన సాయుధులు ఇటీవల పైకి పంపించారు.
మీడియా మౌనం..
పాకిస్తాన్ పత్రికల్లో ఈ ఘటనలపై వార్తలు లేవు. చనిపోయినవారిని హడావుడిగా ఖననం చేస్తున్నారు. పెద్ద నాయకులు టార్గెట్ కాకుండా బయటకు రానివ్వడం లేదు. ఇది ఉగ్రవాదుల పాకిస్తాన్ ఉనికిని దాచాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది.
కొత్త ఆపరేషన్లు..
ఒకవైపు సాయుధులు ఉగ్రవాద మద్దతుదారులను లేపేస్తూనే కొత్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తాజగా పూంచ్ సమీప రావాల్‌పూర్‌లో లష్కర్ డెప్యూటీ కమాండర్ రిజ్వాన్ అహ్మద్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి భార్య, పిల్లలు మరణించారు. రిజ్వాన్ గురించి స్పష్టత లేదు. ఇది అజ్ఞాత సాయుధుల కుట్రగా తెలుస్తోంది.
దావూద్ గిలానీ (డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ) ఇల్లు కాలిపోయింది. ఇతను 2008 ముంబై పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన ఈ అమెరికా పౌరుడు భారత దాడుల బ్లూప్రింట్‌లు రూపొందించాడు. ఇల్లు కాలడం యాక్షన్ సంకేతం.
ఈ దాడులు టాప్ లీడర్లు, గ్రౌండ్ వర్కర్ల మధ్య సామరస్యాన్ని బలహీనం చేస్తున్నాయి. పాకిస్తాన్‌లో ఉగ్రవాద మూలాలపై ఒత్తిడి పెరిగి, భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆగిపోయే అవకాశం ఉంది.