Udumbara Flower : ప్రపంచంలో ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి. కానీ అన్ని పుష్పాల గురించి అందరికీ పెద్దగా తెలియదు. మనకి తెలియని పుష్పాలు చాలానే ఈ లోకంలో ఉన్నాయి. సాధారణంగా మనకి గులాబీ, చామంతి, మందార ఇలా బాగా ఫేమస్ అయిన పుష్పాలు గురించి మాత్రమే తెలుసు. కానీ పురాతన కాలం నుంచి ఉన్న పుష్పాలు ఎన్నో కూడా ఉన్నాయి. అందులో కొన్ని పుష్పాలను చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటి వాటిలో ఉదుంబర పుష్పం ఒకటి. ఈ పువ్వు ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. అరుదుగా దొరికే ఈ పుష్పం ఎన్నేళ్లకు ఒకసారి పుడుతుందో తెలిస్తే షాక్ అవుతారు. పురాతన కాలం నుంచి ఉన్న ఈ పుష్పం 3000 ఏళ్లకు ఒకసారి మాత్రమే పుష్పిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ఉదుంబర పుష్పం ఒక్క వియత్నాంలో మాత్రమే దొరుకుతుంది. దీనిని వియత్నాంలోని ఒక టెంపుల్‌లో గుర్తించారు. 3000 ఏళ్లకు ఒకసారి పుష్పించే ఈ పువ్వు ప్రస్తావన మహాభారతంలో కూడా ఉంది. కేవలం మహాభారతమే కాకుండా బౌద్ధమతంలో కూడా ఈ పువ్వు ప్రస్తావన ఉంది.
అత్తి పండ్లలో ఉన్నట్లు ఉదుంబర పువ్వులు వాటి పండ్లలో ఈ పువ్వులు ఉంటాయి. దీని పువ్వులు పండు లోపల ఉంటాయి. కాబట్టి ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. అయితే ఈ పుష్పం 3000 ఏళ్ల సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుందని బౌద్ధమతం చెబుతుంది. వివిధ వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంటుందట. ముఖ్యంగా చనిపోయిన వారి ప్రాణాలను రక్షించగలదని పురాణాలు చెబుతున్నాయి. అతిధేయ చెట్టు కొమ్మలపై గింజలు అభివృద్ధి చెందుతాయి. ఈ గింజలు అభివృద్ధి చెందడం వల్ల స్ట్రాంగ్లర్ ఫిగ్స్ అనే చెట్లు ఏర్పడతాయి. అందులో ఉంబర చెట్లు కూడా ఒక రకం. అయితే దీనికి ఉన్న స్వంత వేర్లు, కొమ్మలతో అతిధేయ చెట్లతో జీవనం చేస్తాయి. దీంతో అతిధేయ చెట్టు చనిపోతుంది. దీని స్థానంలో ఉదుంబర పువ్వుల చెట్లు ఏర్పడతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఉదుంబర పుష్పం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ దొరకదు. దాదాపుగా 3000 ఏళ్లకు ఒకసారి వికసిస్తుందని బౌద్ధమతం చెబుతోంది. కానీ మన అదృష్టం కొద్దీ ఏమో.. ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఈ పుష్పం కనిపించింది. చూడటానికి గంట ఆకారంలో ఉండే ఈ పుష్పం.. బంగారు పట్టు మీద సన్నని కాండంతో ఉంటుంది. ఈ పువ్వు నుంచి సువాసనలు వెదజల్లుతాయి. చాలా అరుదుగా కనిపించే ఈ పుష్పం చాలా పవిత్రమైనది. ఉదుంబర పుష్పం అదృష్టానికి చిహ్నమని బౌద్ధ గ్రంధాలు చెబుతున్నాయి. అయితే ఈ పువ్వు చాలా చిన్నగా ఉంటుందని.. భూతద్దం లేకుండా దీనిని గుర్తించడం చాలా కష్టం. మొదటిసారి 1997లో వికసించిన ఈ ఉదుంబర పుష్పం తర్వాత 2005, 2007, 2010, 2012లో కూడా దర్శన