spot_img
Homeఅంతర్జాతీయంUAE acquires Israel Iron Dome: యూఏఈ చేతికి ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌.. మధ్యప్రాచ్య యుద్ధంలో...

UAE acquires Israel Iron Dome: యూఏఈ చేతికి ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌.. మధ్యప్రాచ్య యుద్ధంలో అనూహ్య మలుపు!

UAE acquires Israel Iron Dome: అమెరికా రాజేసిన పశ్చిమాసియా యద్ధు జ్వాలలు చల్లారడం లేదు. సామ్రాజ్యవాదం.. దురహంకారంతో అగ్రరాజ్య అధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు మొదలు పెట్టాడు. పేద దేశం, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాన్‌ను వారం రోజుల్లో లొందగీసుకోవచ్చని అంచనా వేశాడు. కానీ ఇరాన్‌ గట్టిపిండమని ఇప్పుడు అమెరికాకు అర్థమైంది. 50 రోజులు దాటినా ఇరాన్‌ అమెరికా దాడులను తట్టుకుని.. అమెరికా మద్దతుగా నిలిచిన గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. తీవ్రంగా నష్టం గలిగిస్తోంది. ఈ తరుణంలో యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకోవడానికి ట్రంప్‌ తంటాలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో పశ్చిమాసియా యుద్ధంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఇరాన్‌ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ వంటి అనూహ్య మిత్రుడిని ఆశ్రయించుకుంది. ఇజ్రాయెల్‌ తన అధునాతన ఐరన్‌ డోమ్‌ వ్యవస్థను అందించడంతోపాటు, దాన్ని నడిపే సైనిక బృందాలను కూడా తరలించింది.

కీలక పరిణామాలు..
ఇరాన్‌ దాడుల పెరిగిన సమయంలో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌ జాయెద్, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూకు నేరుగా ఫోన్‌ చేశారు. ఈ సంభాషణ తర్వాత ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌)కు తక్షణ ఆదేశాలు జారీ అయ్యాయి. అబుదాబి వంటి కేంద్రాలు ప్రధాన లక్ష్యాలుగా మారినప్పుడు, ఐరన్‌ డోమ్‌ డజన్ల క్షేపణులను, డ్రోన్‌లను సిద్ధం చేసింది. యూఏఈ రక్షణ శాఖ ప్రకారం, ఇరాన్‌ మొత్తం 550 బాలిస్టిక్‌ క్షేపణులు, 2,200 డ్రోన్‌లను ప్రయోగించింది. ఈ సహాయంతో యూఏఈ తన భద్రతను బలోపేతం చేసుకుంది.

ఈ సంఘటన ఇజ్రాయెల్‌–యూఏఈ సంబంధాలకు కొత్త ఆవిర్భావాన్ని తెచ్చిపెట్టింది. మొదటిసారిగా ఇజ్రాయెల్‌ తన దేశ సరిహద్దు బయట ఐరన్‌ డోమ్‌ను మోహరించింది. ఇది రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని మరింత లోతుగా చేసిందని అమెరికా మీడియా సూచిస్తోంది. అయితే, అమెరికా కూడా తన సొంత రక్షణ వ్యవస్థలను ఉపయోగించడంతోపాటు, ప్రాంతీయ స్థిరత్వానికి కృషి చేస్తోంది. ఇరాన్‌ దాడులు యూఏఈ ఆర్థిక కేంద్రాలను బెదిరించినా, ఈ మిత్రత్వం యుద్ధ భయాన్ని తగ్గించి, భవిష్యత్‌ సహకారాలకు మార్గం సుగమం చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version