spot_img
Homeఎంటర్టైన్మెంట్Ravi Teja remuneration reduced: రెమ్యూనరేషన్ భారీగా తగ్గించేసిన రవితేజ.. 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయాడుగా...

Ravi Teja remuneration reduced: రెమ్యూనరేషన్ భారీగా తగ్గించేసిన రవితేజ.. 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయాడుగా పాపం..

Ravi Teja remuneration reduced: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలుపెట్టి, ఇండస్ట్రీ లోనే బిగ్గెస్ట్ స్టార్ గా ఎదగడం అనేది చిన్న విషయం కాదు, ఎంతో కష్టపడే తత్త్వం తో పాటు, బోలెడంత అదృష్టం కూడా ఉండాలి. ఈ రెండు కలిసొచ్చిన హీరో రవితేజ(Mass Maharaja Raviteja). కెరీర్ ప్రారంభంలో ఈయన తనకు వచ్చిన ప్రతీ చిన్న పాత్రలో నటించడానికి ఒప్పుకునేవాడు. అలా చిన్నగా ఆడియన్స్ కి అలవాటు అయ్యాక, హీరో గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని , ఆరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అత్యధిక రెమ్యూనరేషన్ ని తీసుకునే హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అలాంటి రవితేజ ఇప్పుడు ఎలాంటి స్థాయికి పడిపోయాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్స్ లీగ్ లో ఉండాల్సిన హీరో, కానీ ఇప్పుడు మీడియం రేంజ్ లో కూడా మార్కెట్ లేదు.

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రవితేజ మళ్లీ తన సక్సెస్ స్ట్రీక్ ని మొదలు పెట్టాడని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ రెండు సినిమాల తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగులుతూ వచ్చింది. ఒకప్పుడు రవితేజ కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇస్తూండేవాడు. ఆ కారణం వల్లే బోయపాటి శ్రీను , గోపీచంద్ మలినేని , బాబీ కొల్లి ఇలా ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ లోకి వచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం వల్లే, ఆయన కెరీర్ , మార్కెట్ పూర్తిగా రిస్క్ లో పడింది. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ‘భర్త మహాయసయులకు విజ్ఞప్తి’ అనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్లాప్ గా మిగిలిన సంగతి తెలిసిందే.

విడుదలకు ముందు ఈ చిత్రానికి కేవలం 20 కోట్ల రూపాయిల బిజినెస్ మాత్రమే జరిగింది. రవితేజ రేంజ్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. అయినప్పటికీ కూడా 10 కోట్ల నష్టం తోనే ఈ సినిమా రన్ పూర్తి అయ్యింది. దీనిని బట్టీ ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా మార్కెట్ బాగా డౌన్ అవ్వడంతో రవితేజ తన రెమ్యూనరేషన్ ని కూడా బాగా తగ్గించినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు 20 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే ఆయన ఇప్పుడు 13 కోట్ల రూపాయలకు తగ్గించాడట. వరుసగా ఫెయిల్యూర్స్ రావడం తో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ 13 కోట్లు కూడా చాలా ఎక్కువ అని నిర్మాతలు ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వం లో ఇరుముడి అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తో ఆయన కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version