Great Wall of China : చైనా గోడ.. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోట్లాదిమంది పర్యాటకులు ఈ చైనా గోడను సందర్శిస్తుంటారు. ఈ గోడను చైనా తన మహాకుంట అభి వర్ణించుకుంటుంది. ఇప్పటికీ ఈ గోడమీద అనేక రకాల పరిశోధనలు జరుగుతుంటాయి. ఇన్ని సంవత్సరాలయినప్పటికీ ఈ గోడ కూలకుండా ఎలా ఉందనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతుపట్టడం లేదు. దీన్ని ఎలాంటి పదార్థాలు కూడా నిర్మించిందో బయట ప్రపంచానికి చైనా చెప్పడం లేదు. అంతటి ఈ చైనా గోడను కొందరు అడ్డుగా ఉందని అడ్డగోలుగా కూల్చేశారు.
అడ్డుగా ఉందని, షార్ట్ కట్ దారి కోసం ఇద్దరు వ్యక్తులు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను కూల్చేశారు. తాము చేపట్టిన నిర్మాణం దగ్గరికి పోయి వచ్చేందుకు అడ్డుగా ఉందని పురాతన గోడలో కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. నిర్మాణం జరిగే చోటుకు సామగ్రిని తీసుకెళ్ళేందుకు గోడ చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుందని వాళ్లు ఇలా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను ఈశాన్య చైనాలోని షాంగ్సీ ప్రావీన్స్ లోని పోలీస్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ప్రామిస్ లో ఉండే 35 ఏళ్ల వ్యక్తి, 55 సంవత్సరాల ఒక మహిళ అక్కడ ఒక నిర్మాణం చేపడుతున్నారు. అయితే అక్కడికి పోయి వచ్చేందుకు, తమ సామగ్రిని తరలించేందుకు ప్రతిరోజు గోడ చుట్టూ కొన్ని కిలోమీటర్లు తిరగాల్సి వస్తోంది. దీంతో వారు విసిగిపోయారు. చుట్టూ తిరిగే ఓపిక లేక ఒక నిర్ణయం తీసుకున్నారు.
చేపట్టిన నిర్మాణం వద్దకు సులువుగా వెళ్లడానికి అడ్డుగా చైనా గోడ ఉంది. ఇది వారికి ఇబ్బందికరంగా మారింది. తాము చేపట్టిన నిర్మాణం వద్దకు వెళ్లాలంటే సులువైన దారి ఉండాలి అనుకున్నారు. దీంతో షార్ట్ కట్ కోసం బుల్డోజర్ తో గోడను తవ్వారు. తమ రోడ్డు మార్గాన్ని క్లియర్ చేసుకున్నారు. ఇది ఆగస్టు నెలలో జరిగింది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న చైనా పోలీసు అధికారులు ఆగస్టు 24న సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చైనా గోడను తవ్విన ఆనవాళ్ళను పరిశీలించారు. బుల్డోజర్ తో గోడను తవ్విన ప్రదేశాన్ని ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి, మరో మహిళ కీలక పాత్ర పోషించారని గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంపై చైనా డైలీ మెయిల్ ఆందోళన వ్యక్తం చేసింది. చారిత్రాత్మక గ్రేట్ వాల్ కే చైనీయులు గండి కొట్టారని ఆరోపించింది. కాగా ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాలలో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం మూడవ దశాబ్దంలోనే ప్రారంభమైంది. ఇప్పుడు కనిపిస్తున్న కట్టడం.. క్రీస్తుశకం 1368_1644 లో మిగ్ రాజవంశీయుల చేతిలో నిర్మితమైనట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ గోడను 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది.