Donald Trump YMCA dance: ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతేకాదు వీసాల మీద అడ్డగోలుగా ఫీజులు విధిస్తూ తన నియంతృత్వాన్ని నిరూపించుకుంటున్నాడు. తమ దేశంలో ఉంటున్న వారిని బయటికి వెళ్లగొడుతున్నాడు. అమెరికాలో ఉంటున్న వారికి మాత్రమే తమ ప్రాధాన్యమంటూ పేర్కొంటున్నాడు. అంతేకాదు వినోద పరిశ్రమ మీద కూడా ఉక్కు పాదం మోపుతున్నాడు. ఏకంగా 100% సుంకాలు అంటూ తిక్క తిక్క నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పేరుకు అమెరికా ప్రయోజనాలు అని చెబుతున్నప్పటికీ.. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల కొత్త ఉద్యోగాలు రాకపోగా.. ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పైగా ఆర్థికంగా కూడా అమెరికా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. షట్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది.
ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా ట్రంప్ తన దూకుడును తగ్గించుకోవడం లేదు. పైగా ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని మరింత పెంచుతున్నాడు. తన ప్రయోజనాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా చూసుకుంటున్నాడు. ఓవైపు ఆర్థికంగా ఒత్తిడి అని చెబుతూనే.. పాకిస్తాన్ దేశంలో వెలికి తీసిన ఖనిజాలను అమెరికాకు రవాణా చేయడానికి ఏకంగా పోర్టు నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు పాకిస్తాన్ దేశానికి తెర వెనుక ఆర్థిక సహాయం చేయడానికి కూడా అమెరికా వెనుకాడటం లేదని సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ తన తెలివి తక్కువ నిర్ణయాలతో ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. అమెరికాను మరింత ప్రమాదంలోకి నెడుతున్నాడు. ఇంత చేస్తున్నప్పటికీ ట్రంప్ తన టెంపరితనాన్ని ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. పైగా మరింత రెచ్చిపోతున్నాడు.
మామూలుగానే ట్రంప్ విలాస పురుషుడు. ఇప్పటికే ఆయన ఎంతోమందితో వ్యవహారాలు సాగించారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ పెద్దల చిత్రాలలో నటించే నటితో కలిసి చీకటి కార్యకలాపాలు సాగించాడని.. అప్పట్లో అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ట్రంప్ తన లాయర్ల ద్వారా ఈ కేసును అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకున్నాడు. ఇక ఇప్పుడు ట్రంప్ మరోసారి వార్తలలో నిలిచాడు. అమెరికా నేవీ 250 వార్షికోత్సవంలో అతడు పాల్గొన్నాడు. సిబ్బందిని ఉద్దేశించి ఉత్సాహపూరితమైన ప్రసంగం చేశాడు. నేవీ రూపొందించిన పాటకు డ్యాన్స్ వేసి అలరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. వయసు రీత్యా ట్రంప్ తాను ఉన్నచోటనే కాళ్లు చేతులు అమెరికన్ ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాడు. సుంకాల ద్వారా ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధిస్తూ.. ఇప్పుడు స్టెప్పులు వేస్తున్నావా అంటూ ట్రంప్ ను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Trump Dance with the Navy Sailors! pic.twitter.com/y34QeGjOyy
— Margo Martin (@MargoMartin47) October 5, 2025