Pawan Kalyan Speech: కర్ణాటక రాష్ట్రానికి చెందినవాళ్లు ఈమధ్య కాలంలో మన తెలుగు వాళ్లపై చేస్తున్న దాడులు చూస్తూనే ఉన్నాం. బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేయడానికి వెళ్లిన మన తెలుగు వాళ్ళను కన్నడ మాట్లాడలేదని దాడులు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. రీసెంట్ గానే విడుదలైన మన తెలుగు సినిమా ‘ఓజీ’ పోస్టర్లు, కటౌట్స్ కన్నడ భాషలో లేవని థియేటర్స్ వద్దకు వెళ్లి పోస్టర్లను చింపేయడం, బ్యానర్స్ ని కాల్చేయడం వంటివి మనం చాలానే చూసాము. సోషల్ మీడియా లో వీటిని చూసిన నెటిజెన్స్, కన్నడ సినిమా అయినటువంటి కాంతారా ని బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కళకు బాషా బేధాలు ఉండకూడదు అని ఆ సినిమాకు ప్రత్యేకంగా టికెట్ రేట్స్, అదనపు షోస్ కూడా ఇప్పించాడు.
అంతే కాదు నేడు కర్ణాటక లో జరిగిన అమృత మోహోత్సవం కి ముఖ్య అతిధిగా వెళ్లిన పవన్ కళ్యాణ్, అక్కడ అరగంట పాటు నాన్ స్టాప్ గా కన్నడ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. దేశం లో ఉన్న ప్రతీ బాషాని గౌరవించాలి అనేది ఈ ప్రసంగం తోనే మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళపై, తెలుగు సినిమాలపై వాళ్ళు చేస్తున్న దాడులు గురించి కఠినంగా నిలదీయడానికి బదులుగా, ఆయన ఎంచుకున్న ఈ మార్గం ఎంతో గొప్పది అంటూ సోషల్ మీడియా లో విలాసేషకులు కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కన్నడ భాషకి ఇచ్చిన గౌరవాన్ని చూసి అయినా కన్నడ ప్రజలు మారుతారా?, మన బాషాని గౌరవిస్తారా లేదా?, భవిష్యత్తులో రాబోయే సినిమాలకు కూడా ఇలాగే చేస్తారా?, లేదా ఇక నుండి అయినా మారుతారా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అభిమానులు ప్రేమతో కట్టుకున్న బ్యానర్లలో కన్నడ భాష లేకపోతే చింపేయడం ఏంటి?.
ఇది కొత్తగా జరగడం లేదు, గతం లో ఎన్నో సినిమాలకు ఇలా జరిగింది. మొన్న కాంతారా హీరో రిషబ్ శెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ కి వచ్చి మరీ కన్నడ భాషలోనే ప్రసంగం ఇచ్చాడు. అది కూడా మన తెలుగు హీరో ఎన్టీఆర్ ని పక్కన నిల్చోబెట్టుకొని. మనం ఎక్కడ ఉన్నాం?, ఏ భాషలో మాట్లాడాలి అనే ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా?, ఇదే హీరో నార్త్ ఇండియా కి వెళ్ళినప్పుడు హిందీ లో మాట్లాడాడు. అంటే తెలుగు బాషా వీళ్ళ దృష్టిలో ఇంత చులకనా?, నేడు కాంతారా చిత్రానికి కర్ణాటక రాష్ట్రం తర్వాత అత్యధిక వసూళ్లు వస్తున్నది మన తెలుగు లోనే. ఒక డబ్ సినిమాకు టికెట్ రేట్స్ పెంచినా థియేటర్స్ కి వెళ్లి చూస్తున్నారు. అంతటి గొప్ప మనసు మన తెలుగు ఆడియన్స్ కి. కనీసం ఇప్పటికైనా గ్రహించి, అక్కడి ప్రజలు కానీ, హీరోలు కానీ, మన తెలుగు భాష ని గౌరవించాలని ఆశిద్దాం.
Deputy CM @PawanKalyan speaking Kannada ❤️
Basic Thing Should Learn Giving Respect To Other Languages like #PawanKalyan pic.twitter.com/H0C07bdfXc
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) October 6, 2025
That’s our #PawanKalyan ❤️#Kannada #Karnataka #TheyCallHimOG #DeputyCM #tollymasti
Follow us @tollymasti pic.twitter.com/YNycNgHkVE
— Tollymasti (@tollymasti) October 6, 2025