Donald Trump : డోనాల్డ్ ట్రంప్.. అమెరికా రాజకీయాలలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి. పెళ్లి దగ్గర నుంచి మొదలు పెడితే వ్యాపారం వరకు ప్రతి విషయంలోనూ అతడి నోటి దురుసుతనం కనిపిస్తుంది. ప్రత్యర్థులను పంది అని పోల్చినా.. ఇతర దేశాల అధ్యక్షులను మురికి గల వ్యక్తులు అని ఆరోపించినా అది ఆయనకే చెల్లుతుంది. అయితే అలాంటి ట్రంప్ అమెరికా ప్రయోజనాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయరు. పైగా బీయింగ్ అమెరికన్.. లెట్స్ మోర్ పవర్ టు అమెరికా.. అంటూ రకరకాల స్లోగన్స్ చెబుతుంటారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడు గెలిచిన ట్రంప్.. అనేక పార్టీలు మారారు. ముందుగా ఆయన రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేశారు. మూడు సంవత్సరాల అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరారు. 2001 నుంచి 2008 వరకు ఆయన డెమోక్రటిక్ పార్టీలోనే కొనసాగారు. అనంతరం జాన్ మేక్ పెయిన్ అమెరికా అధ్యక్షుడు పదవికి అభ్యర్థిగా బలపరుస్తూ రిపబ్లికన్ పార్టీలో మళ్లీ చేరారు. ఆ పార్టీలోకి రావడానికి ఐదు నెలల ముందు న్యూట్రల్ గా ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు ఆరుగురు డెమొక్రటిక్, నలుగురు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు సహాయం చేశారు. అయితే అప్పట్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఫలితాలు రావడంతో ఆయన తన మనసు మార్చుకున్నారు.
ఇద్దరు మహిళలపై గెలుపు
ట్రంప్ జూన్ 14 1946న న్యూయార్క్ లోని క్వీన్స్ లో జన్మించారు. ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడ్, తల్లి పేరు మేరీ అన్నే మాక్లియోడ్ ట్రంప్. తన తల్లిదండ్రులకు ట్రంప్ నాలుగో సంతానంగా జన్మించారు. 1968 లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లో ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ముందుగా ట్రంప్ వ్యాపారం లోకి ప్రవేశించారు. స్థిరాస్తి వ్యాపారాన్ని ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై విజయం సాధించారు. 2024లో డెమొక్రటిక్ పార్టీ మహిళా అభ్యర్థి కమలా హారీస్ పై గెలుపొందారు. ప్రపంచంలో ఏ దేశాధినేత కూడా ఇలా మహిళలపై విజయం సాధించి పీఠాన్ని అధిరోహించలేదు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి బైడన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఓటమిపాలైనప్పటికీ రిపబ్లికన్ పార్టీపై తన ఆధిపత్యాన్ని ట్రంప్ కొనసాగించారు.
జర్మనీ వాసులు
ట్రంప్ పూర్వికులు అమెరికన్లు కాదు. వారు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు. ట్రంప్ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆయన స్ఫూర్తితో ట్రంప్ వ్యాపారం లోకి అడుగుపెట్టాడు. అమెరికాలోనే కాదు ట్రంప్ కు పూణే, ముంబై ప్రాంతాలలో స్థిరాస్తి వెంచర్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్, హోటళ్లు, స్పోర్ట్స్ క్లబ్ లు, అందాల పోటీలు వంటి వాటిని నిర్వహించడంలో ట్రంప్ ది అందే వేసిన చెయ్యి. ట్రంపు ఆస్తులు లక్షల కోట్లల్లో ఉంటాయి. అమెరికాలో ఉన్న సంపన్నులలో ట్రంప్ ఐదో స్థానంలో ఉంటాడు . ఆయన సంపాదన ఏకంగా ఐదు ఇండియన్ డాలర్లను ఎప్పుడో దాటింది. ట్రంప్ గ్రూప్ తో పాటు ట్రంప్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిసార్ట్స్ సంస్థలకు అతడు సీఈఓ గా ఉన్నాడు.. ట్రంప్ మొదటి భార్య ఇవానా 2022 జూలై 14న కన్ను మూసింది. ట్రంప్ ప్రస్తుతం తన రెండవ భార్య మెలినియా తో కలిసి ఉంటున్నాడు.