spot_img
Homeఅంతర్జాతీయంTrump Pakistan geopolitical strategy: పాకిస్తాన్‌ కోసం ట్రంప్‌ త్యాగం.. జియోపాలిటిక్స్‌లోకొత్త మలుపు

Trump Pakistan geopolitical strategy: పాకిస్తాన్‌ కోసం ట్రంప్‌ త్యాగం.. జియోపాలిటిక్స్‌లోకొత్త మలుపు

Trump Pakistan geopolitical strategy: పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో యుద్ధం మొదలు పెట్టాడు. ఇజ్రాయెల్‌తో కలిసి దాదాపు నెల రోజులు తీవ్రమైన దాడులు చేశారు. అయితే ఇరాన్‌ ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. అమెరికాకు చుక్కలు చూపించింది. అమెరికాకు అండగా నిలిచిన గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేసింది. 50 రోజుల తర్వాత ఇరాన్‌–అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌ కుదిరింది. ఇది తాత్కాలికమే. అయితే ఈ సీజ్‌ఫైన్‌కు కారణం పాకిస్తాన్‌ అంటూ ట్రంప్‌ మన దాయాది దేశాన్ని పొగడ్తలతో ముంచెతుతున్నాడు.

చైనా పర్యటన ముగించుకుని..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చనీయాంశమైంది. పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో సీజ్‌ఫైర్‌ ఒప్పందానికి అంగీకరించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక యుద్ధ విరామం కాదని, దీని వెనుక మూడు దేశాల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాలు దాగి ఉన్నాయి. పాకిస్తాన్‌ ఎప్పటినుంచో అమెరికా, చైనా, ఇరాన్‌ మధ్య సమతుల్య విధానాన్ని అనుసరిస్తోంది. ఇరాన్‌పై ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాక్‌ తన సరిహద్దు భద్రత, ఆర్థిక సవాళ్లు, మతపరమైన సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అమెరికాను ఒత్తిడి చేసి ఉండవచ్చు. ట్రంప్‌ పాక్‌ ప్రధాని, ఫీల్డ్‌ మార్షల్‌ను ‘అద్భుతమైన వ్యక్తులు‘ అని ట్రంప్‌ వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు ప్రతీక. గతంలో ట్రంప్‌ పాలనలోనే పాకిస్తాన్‌కు సహాయం తగ్గించిన సందర్భాలు ఉన్నా, ప్రస్తుతం భారత్‌–పాక్, ఇరాన్‌–పాక్‌ సంబంధాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.

తాత్కాలిక ఉపశమనమా? వ్యూహాత్మకమా?
ట్రంప్‌ ప్రస్తుతానికి ఇరాన్‌పై దాడులను పునఃప్రారంభించే ప్రణాళిక లేదని ప్రకటించారు. అయితే ఇది తాత్కాలికంగా అదుపులో ఉంచాలనే ఉద్దేశం కనిపిస్తోంది. ఇది అమెరికా ఆర్థిక ఒత్తిడి, ఇతర మధ్యప్రాచ్య దేశాలతో ఉన్న సంబంధాలు, చైనా ప్రభావం వంటి అంశాలను కలిపి చూస్తే వ్యూహాత్మక నిర్ణయమని తెలుస్తోంది. ఇరాన్‌ ఆర్థికంగా, సైనికంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. సీజ్‌ఫైర్‌ ద్వారా అమెరికా తన లక్ష్యాలను సాధించుకుని, అవసరమైతే తిరిగి ఒత్తిడి పెంచే స్థితిలో ఉండాలని చూస్తోంది.

ప్రాంతీయ ప్రభావాలు…
ఇరాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గడం పాక్‌కు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తుంది. అయితే భారత్‌తో ఉన్న సంబంధాల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, దీర్ఘకాలికంగా అమెరికా–ఇజ్రాయిల్‌ ఒత్తిడి కొనసాగవచ్చు. ట్రంప్‌ శైలి ప్రకారం ‘డీల్‌ మేకింగ్‌‘ ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఒక దేశానికి ఫేవర్‌ చేసి మరొకటి నుంచి లాభం పొందే విధానం.

ట్రంప్‌ వ్యాఖ్యలు సాధారణమైనవిగా అనిపించినా, వాటి వెనుక ఉన్న వ్యూహాత్మక లెక్కలు ప్రపంచ రాజకీయాలను మళ్లీ ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. పాకిస్తాన్‌కు చేసిన ఈ ’ఫేవర్‌’ ఎంతకాలం కొనసాగుతుంది, దీని ఫలితాలు ఏమిటి అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పుడూ స్నేహాలు లేదా వ్యతిరేకతలపై కాకుండా, స్వార్థాలు, వ్యూహాలపై ఆధారపడి ఉంటాయని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version