Donald Trump: అగ్రరాజ్యం అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక భారత్‌కు మొదలైన కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్ ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొటోంది. అమెరికా వెళ్లేవారు ఇబ్బంది పడుతన్నారు. ఇక ప్రతీకార సుంకాలు భారత వ్యాపార ఎగుమతులను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే అనేక కారణాలతో దిగుబతులపై 25 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలు అమలు అవుతున్నాయి. తాజాగా రష్యాఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి ట్రంప్ చట్ట సవరణ తీసుకురాబోతున్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై విధించాలనుకున్న సుంకాల గరిష్ట పరిమితిని 500 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. ఈ బిల్లు రష్యా నాయకులు, ఆర్థిక సంస్థలు, ఇంధన సంబంధిత ప్రాజెక్టులను నేరుగా లక్ష్యంగా చేసుకుంటుంది.
సెనేటర్ గ్రాహమ్ ప్రతిపాదనలో మార్పులు
ఈ చట్టం (శాంక్షనింగ్ రష్యా యాక్ట్)ను ఇటీవల మరణించిన సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ప్రతిపాదించారు. దీని ద్వారా అధ్యక్షుడికి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారం లభిస్తుంది. మొదట్లో దీనిని ఆర్థికంగా బలహీనపరిచే శక్తివంతమైన చర్యగా అభివర్ణించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో సుంకాల పరిమితిని 100 శాతానికి తగ్గించి సవరించారు. ఈ మార్పులకు ప్రభుత్వ, వ్యతిరేక పక్షాల నుంచి మద్దతు లభించింది.
భారత్, చైనాపై ప్రభావం..
గ్రాహమ్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఆ దేశాలు రష్యా ఇంధనం కొనకుండా అడ్డుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సవరించిన రూపంలో ఈ నిబంధనలు మిత్రరాజ్యాలకు అనుకూలంగా ఉన్నాయి. లక్ష్యంగా మారే దేశాల్లో చైనా, భారత్, స్లోవేకియా, హంగరీ, అజర్‌బైజాన్ ఉన్నాయి.
సహజ వాయువు దిగుమతులపై మినహాయింపులు
రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జియం ఉన్నాయి. రష్యా వాయువు ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువ దిగుమతి చేసి, సరఫరాలను తగ్గించే చర్యలు తీసుకుంటున్న దేశాలకు ఈ బిల్లులో మినహాయింపులు ఇచ్చారు. ఇది జపాన్, ఫ్రాన్స్‌కు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
మధ్యప్రాచ్యంలో సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు అమెరికా రష్యా ఇంధనంపై మినహాయింపులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ మినహాయింపులను తొలగించే యోచనలో ఉంది. ట్రంప్ పిచ్చి చేష్టలతో మళ్లీ చమురు సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది.
