Trump constitutional change: డొనాల్డ్ ట్రంప్.. మొదటి సారి అధ్యక్షుడు అయ్యాక ఆయనకు పదవీ వ్యామోహం బాగా పెరిగింది. అయితే ఆయన పాలనపై నాలుగేళ్లకే విసిగిపోయిన ప్రజలు రెండోసారి పోలీ చేసినప్పుడు ఓడించారు. ఈ క్రమంలో మళ్లీ 2024లో మూడోసారి పోటీ చేశారు. ఈసారి ఆయనకు చాలా మంది మద్దుతు ఇచ్చారు. 2025 జనవరి 25న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతుల చేపట్టారు. రెండోసారి ఎన్నికల్లో జోబైడెన్‌పై ఓడినత ర్వాత వైట్‌హౌస్ వద్ద హంగామా చేశాడు ట్రంప్. దానికి సంబంధించిన కేసుపై విచాణ జరుగుతోంది. అయితే, ఇప్పటికే రెండుసార్లు అధ్యక్షుడు అయిన ట్రంప్ నాలుగోసారి పోటీ చేసి మూడోసారి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారు. ఈమేరకు తన ట్రూత్ సోషల్ వేదికపై ’నేను నాలుగోసారి పోటీ చేయాలా?’ అని ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టారు. ‘TRUMP 2028, Yes’ అనే సందేశంతో కూడిన ఫొటోను పంచుకున్నారు. ఈ ప్రకటన అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తించింది.
రాజ్యాంగ నిబంధనలకురుద్ధంగా..
అమెరికా రాజ్యాంగం 22వ సవరణ ప్రకారం అధ్యక్షుడు రెండుసార్లు మాత్రమే పదవి చేపట్టవచ్చు. ట్రంప్ ఇప్పటికే మూడుసార్లు పోటీ చేసి, రెండుసార్లు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో నాలుగోసారి పోటీ అసాధ్యం. అయితే, ఆయన పోస్ట్ రాజ్యాంగ సవరణ అవసరాన్ని సూచిస్తున్నట్లు అనిపిస్తోంది.
నాలుగోసారికి అవకాశాలు..
ట్రంప్ పోస్టు రిపబ్లికన్ పార్టీలో ఉత్కంఠను రేకెత్తించింది. రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్‌లో రెండు మూడింటొక్క ఘట్టం అవసరం. ఇది దీర్ఘకాల ప్రక్రియ. ట్రంప్ మిత్రులు దీన్ని ఆయన ఆకర్షణా శక్తిని పరీక్షించే వ్యూహంగా చూస్తున్నారు. వ్యతిరేకులు ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రయత్నంగా విమర్శిస్తున్నారు.
ట్రంప్ ఈ పోస్ట్‌తో 2028 ఎన్నికల్లో తన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఇది పార్టీలో పోటీదారులను హెచ్చరించే సంకేతం కావచ్చు. రాజ్యాంగ సవరణ సాధ్యమైతే చరిత్రలో మొదటి అధ్యక్షుడు అవుతారు. లేకపోతే, ఆయన వారసుడిని ప్రోత్సహించే అవకాశం ఉంది.