Homeఅంతర్జాతీయంTrump Past Remarks: కూతురిపై కన్ను.. వ్యాపారమే దన్ను..ట్రంప్ పక్కా కమర్షియల్!

Trump Past Remarks: కూతురిపై కన్ను.. వ్యాపారమే దన్ను..ట్రంప్ పక్కా కమర్షియల్!

Trump Past Remarks: ఒక రాజకీయ నాయకుడు వ్యాపారి కోణంలో ఆలోచించకూడదు. తనని ఎన్నుకున్న ప్రజల సంక్షేమం, అభివృద్ధి, భద్రత గురించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ కొంతమంది రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మారిపోతారు. తమ సామ్రాజ్యవాదాన్ని అమల్లో పెట్టడం మొదలుపెడతారు. ఎవరు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు అనే ప్రశ్నల సరళి లో మాత్రమే ఆలోచిస్తుంటారు. మాకేంటి? మీకు పని చేస్తే మాకు వచ్చేది ఏమిటి? అనే దిశగా మాత్రమే అడుగులు వేస్తుంటారు. అందువల్లే అలాంటి నాయకులు ఈ ప్రపంచంలో చెడ్డ పేరును.. మకిలీని మూటగట్టుకున్నారు. ఈ జాబితాలో ప్రస్తుత శ్వేత దేశ అధిపతి ట్రంప్ ముందు వరుసలో ఉంటారు.

Also Read:  ట్రంప్ తో జెలెన్స్కీ, యూరప్ నేతల భేటీ.. యుద్ధం ఆగుతుందా?

సాధారణంగా ఇదే రాజకీయ నాయకుడైనా తన ఎదుగుదల గురించి మాట్లాడుతుంటాడు. ప్రత్యర్థులను విమర్శిస్తుంటాడు. వారు తీసుకున్న నిర్ణయాలను తప్పుపడుతుంటాడు..కానీ ట్రంప్ అలా కాదు. ప్రతి సందర్భంలో మురికి భాషను ఉపయోగిస్తుంటాడు. అప్పట్లో తన కూతురు ఉద్దేశించి.. ఒకవేళ తను నా కూతురు కాకపోయి ఉంటే డేటింగ్ చేసే వాడిని అంటూ వ్యాఖ్యానించాడు. అప్పుడు మాత్రమే కాదు ఆమె శరీర సౌష్టవాన్ని అనేక సందర్భాల్లో వివరించాడు. ఒక నాయకుడిగా అతడు ఎప్పుడో అంధ పాతాళానికి చేరిపోయాడు. చివరికి తండ్రిగా కూడా విఫలమైపోయాడు. ఇప్పటికీ అతడు తన మొదటి భార్యను నిర్మానుష ప్రాంతంలో ఎందుకు ఖననం చేశాడు అనే విషయంపై క్లారిటీ లేదు. పెద్దల చిత్రాల్లో నటించే నటిమణి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇప్పటికీ స్పష్టత లేదు. ఆమె ఇతడి పై ఎందుకు ఆరోపణలు చేసింది? ట్రంప్ ఎందుకు ఒక హోటల్లో ఆమెతో కలిసి ఉన్నాడు అనే విషయాలు నేటికీ అమెరికాలో చర్చలో ఉంటాయి.

Also Read: రష్యా చీకొట్టింది.. యుద్ధం ఆగేదెన్నడు ..ఇప్పుడు భారత్ పై పడ్డ ట్రంప్..

ప్రపంచ దేశాల మీద సుంకాల విషయంలో.. తనకు నచ్చని దేశాల మీద యుద్ధం కొనసాగించే విషయంలో ట్రంప్ ఒకడుగు ముందుకే వేస్తాడు. పైగా తన దేశంలో ఉపాధి పొందే వారిపై ఉక్కు పాదం మోపుతాడు. అమెరికాను గొప్పగా చేస్తానని చెబుతూ.. అమెరికా అభివృద్ధికి కారణమైన వారి విషయంలో మాత్రం అత్యంత నిరంకుశ వైఖరి ప్రదర్శిస్తున్నాడు. అందువల్లే ఆధునిక కాలంలో అత్యంత మోసపూరితమైన నాయకుడిగా ట్రంప్ ఆవిర్భవించాడు. వాస్తవానికి బైడన్ వల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందువల్లే ట్రంప్ వైపు అమెరికా ప్రజలు మొగ్గు చూపించారు. కానీ వారి పరిస్థితి ఇప్పుడు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. “బిల్ క్లింటన్ స్ట్రీట్ డాన్సర్.. ఒబామా నైట్ క్లబ్ డ్యాన్సర్.. జో బైడన్ పోల్ డాన్సర్.. ట్రంప్ మాత్రం రికార్డింగ్ డాన్సర్.. అమెరికా అధ్యక్షులు హుందా తనాన్ని కోల్పోయి చాలా సంవత్సరాలయింది. శ్వేత దేశ అధిపతులు ఎప్పటికప్పుడు తమ వలువలను వదిలేస్తున్నారు. ట్రంప్ దాకా వచ్చేసరికి అవి పూర్తిగా ఊడిపోయాయి” సోషల్ మీడియాలో కనిపిస్తున్న జోక్ ఇది. ఇది జోక్ మాత్రమే కాదు యదార్థం.. అది అమెరికా వల్ల ప్రభావితమైన దేశాలకు బాగా తెలుసు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular