Homeఅంతర్జాతీయంTrump Pakistan Controversy: ‘‘ఐ లవ్‌ పాకిస్తాన్‌’’ ట్రంప్‌ రాజకీయ ఆట!

Trump Pakistan Controversy: ‘‘ఐ లవ్‌ పాకిస్తాన్‌’’ ట్రంప్‌ రాజకీయ ఆట!

Trump Pakistan Controversy: నిన్నమొన్నటి వరకు భారత్‌–పాకిస్థాన్‌ యుద్ధం ఆపానని డప్పు కొట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ప్రధాని మోదీ ఇచ్చిన క్లారిటీతో సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడు మరో రాజకీయ ఆట మొదలు పెట్టారు. ఐ లవ్‌ పాకిస్తాన్‌ అని భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

అమెరికా అధ్యక్షుడి రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ తలతిక్క నిర్ణయాలతో అభాసుపాలవుతున్నారు. అమెరికన్లను అమెరికాలోని విదేశీయులను, ప్రపంచ దేశాల విషయంలోను తిక్కతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాలుగు రోజుల సైనిక సంఘర్షణను (ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా) తాను మధ్యవర్తిత్వం చేసి ఆపినట్లు పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌లతో జరిగిన సంభాషణల ద్వారా ఈ సంఘర్షణను నియంత్రించినట్లు ఆయన వాదించారు. అయితే, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఈ వాదనలను ఖండించారు. భారత్‌–పాకిస్తాన్‌ సైనికాధికారుల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే కాల్పుల విరమణ సాధ్యమైందని, అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వం చేయలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ట్రంప్‌ వాదనలు వాస్తవ ఆధారాల కంటే రాజకీయ లబ్ధికోసం చేసినవిగా కనిపిస్తున్నాయి.

Also Read:  Trump Pressured India: ట్రంప్ డిమాండ్లకు నో చెప్పిన భారత్.. సంచలనం

తాజాగా ‘‘ఐ లవ్‌ పాకిస్తాన్‌’’ అని..
ట్రంప్‌ ‘‘ఐ లవ్‌ పాకిస్తాన్‌’’ అన్న వ్యాఖ్యలు ఆయన రాజకీయ శైలికి ప్రతీక. గతంలో కూడా ఆయన పాకిస్తాన్‌పై సానుకూల వ్యాఖ్యలు చేశారు. 2019లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశంలో పాకిస్తాన్‌ను సందర్శించాలని ఆసక్తి వ్యక్తం చేశారు. 2025 మేలో ఫాక్స్‌ న్యూస్‌ ఇంటర్వ్యూలో పాకిస్తానీయులను ‘‘అద్భుతమైన వ్యక్తులు’’గా, వారి ఉత్పత్తులను ‘‘ఉన్నతమైనవి’’గా కొనియాడారు. ఈ వ్యాఖ్యలు అమెరికా–పాకిస్తాన్‌ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, పాకిస్తాన్‌ ఎగుమతులపై 29% సుంకం విధించే ముందు సానుకూల వాతావరణం సృష్టించడం లక్ష్యంగా కనిపిస్తాయి. అదే సమయంలో, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలనే ట్రంప్‌ ఆలోచన రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను కొనసాగించే ప్రయత్నంగా చూడవచ్చు.

భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలపై ప్రభావం
ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌–పాకిస్తాన్‌ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం తక్కువ. భారత్‌ ఎప్పుడో మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించింది. పాకిస్తాన్‌ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ సాధ్యమైందని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ వైపు నుంచి ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలపడం అమెరికాతో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒక దౌత్యపరమైన అడుగుగా కనిపిస్తుంది. అయితే, ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ‘‘నిర్మాణాత్మక ఉపన్యాస యుద్ధాన్ని’’ రేకెత్తించాయి. భారత్‌ తన స్వతంత్ర విధానాన్ని నొక్కిచెప్పగా, పాకిస్తాన్‌ అంతర్జాతీయ మద్దతును కోరుతోంది.

Also Read:  Trump Musk Differences: ట్రంప్‌–మస్క్‌ విభేదాలు: అమెరికా పాలనలో అనిశ్చితి నీడలు

సోషల్‌ మీడియాలో విమర్శలు..
ట్రంప్‌ వ్యాఖ్యలు విమర్శలను రేకెత్తించాయి. గతంలో ఆయన పాకిస్తాన్‌ను ‘‘మోసగాళ్లు’’గా విమర్శించిన సందర్భాలు (2018 ట్వీట్‌లో అమెరికా సహాయం ‘‘వృధా’’ అని పేర్కొనడం) గుర్తుకు వస్తున్నాయి. అలాగే, 2025లో ట్రంప్‌ పాకిస్తాన్‌ను ‘‘తుడిచిపెడతాను’’ అని చెప్పినట్లు వచ్చిన వీడియో నకిలీదని (ఏఐ రూపొందించినది) నిర్ధారణ అయింది. ఎక్స్‌లోని పోస్ట్‌లు ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. కొందరు ట్రంప్‌ చరిత్ర జ్ఞానం, అతిశయోక్తులను విమర్శిస్తుండగా, మరికొందరు ఆయన దౌత్య ప్రయత్నాలను సమర్థిస్తున్నారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ ‘‘ఐ లవ్‌ పాకిస్తాన్‌’’ వ్యాఖ్యలు, భారత్‌–పాకిస్తాన్‌ సంఘర్షణను ఆపినట్లు చేసిన వాదనలు ఆయన రాజకీయ శైలి, అమెరికా దౌత్య వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. అయితే, భారత్‌ స్పష్టమైన వైఖరి, వాస్తవాలు ఈ వాదనలను సమర్థించడం లేదు. ఈ వ్యాఖ్యలు భారత్, పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడం లక్ష్యంగా కనిపిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular