Homeఆంధ్రప్రదేశ్‌Karanam Balaram TDP Reentry News: టిడిపిలోకి వైసీపీ సీనియర్?

Karanam Balaram TDP Reentry News: టిడిపిలోకి వైసీపీ సీనియర్?

Karanam Balaram TDP Reentry News: సీనియర్ నేత కరణం బలరాం( karanam Balaram ) మాతృ పార్టీలోకి వస్తారా? తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరుతారా? తెలుగుదేశం హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు బలరాం. దీంతో ఆయన తిరిగి టిడిపిలో చేరుతారని తెగ ప్రచారం నడుస్తోంది. అయితే తెలుగుదేశం శ్రేణుల నుంచి అభ్యంతరాలు రావడంతో నాయకత్వం ఇన్ని రోజులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న సమాచారం మేరకు చాలామంది నేతలను ముందస్తుగా చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కరణం బలరాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే మంచి సమయం అని భావిస్తున్న బలరాం సైతం టిడిపిలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత కరణం బలరాం. ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. ప్రకాశం జిల్లాలో( Prakasam district) తనకంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పని చేస్తూ వచ్చారు. ప్రకాశం జిల్లాలో టిడిపికి పెద్దదిక్కుగా ఉండేవారు. అటువంటి ఆయన తన కుమారుడు వెంకటేష్ తో కలిసి 2019 ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2024 ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేష్ పోటీ చేశారు. కానీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటినుంచి సైలెంట్ గా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాశం జిల్లా బాధ్యతలను తన కుమారుడు వెంకటేష్ కు జగన్ అప్పగిస్తారని భావించారు. అది జరగకపోయేసరికి పార్టీలో ఉండడం వేస్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపారు. ఎట్టకేలకు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: YSR Congress Party : వైసీపీకి ఆ ఇద్దరు నేతలు షాక్!

చంద్రబాబుకు సమకాలీకుడు
కరణం బలరాం చంద్రబాబుకు( Chandrababu) సమకాలీకుడు. ఆయనతో పాటే తొలిసారిగా 1978లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1977లో ఒంగోలులో ఇందిరా గాంధీ పై దాడికి ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమెను రక్షించి ప్రాచుర్యం పొందారు. అలా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కేసరికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వరుసగా ఆ పార్టీ నుంచి ఐదు సార్లు గెలిచారు. 1999లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2019లో చీరాల నుంచి అనూహ్యంగా విజయం సాధించారు. కానీ కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. మొన్నటి ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇప్పించుకున్నారు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు.

Also Read: Their eyes are on TDP : నాడు ఫిరాయించారు.. నేడు వస్తామంటున్నారు.. వైసీపీలో గోడమీద పిల్లులు రెడీ!

కుమారుడు భవిష్యత్తు కోసమే
కుమారుడు వెంకటేష్( Venkatesh) రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారు కరణం బలరాం. తెలుగుదేశం పార్టీ ద్వారా అయితే సేఫ్ గా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. గతంలో తాను ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడంతో అన్ని అసెంబ్లీల పై పట్టు ఉంది. ఈ తరుణంలో సంతనూతలపాడు వంటి నియోజకవర్గం పునర్విభజనలో జనరల్ గా మారే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ నియోజకవర్గ నుంచి తన కుమారుడికి టిడిపి టికెట్ ఇప్పించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే కరణం బలరాం విషయంలో టిడిపి శ్రేణులనుంచి అభ్యంతరాలు ఉండడంతో కొంత జాప్యం జరిగింది. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కరణం బలరాంకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular