Homeఅంతర్జాతీయంTrump Pakistan Army Chief Meeting: అమెరికన్లు ఛీ కొట్టినా.. పాక్ ఆర్మీ చీఫ్ ను...

Trump Pakistan Army Chief Meeting: అమెరికన్లు ఛీ కొట్టినా.. పాక్ ఆర్మీ చీఫ్ ను దగ్గరికి తీసిన ట్రంప్.. వైట్ హౌస్ లో భోజనం, ఏకాంతంగా భేటీ!

Trump Pakistan Army Chief Meeting:  ప్రపంచానికి సుద్ధులు చెబుతుంటాడు. అదేపనిగా నీతులు వల్లె వేస్తుంటాడు. కానీ తాను మాత్రం వాటిని పాటించడు. పైగా ప్రపంచం మీద పెత్తనం సాగించాలని భావిస్తుంటాడు. అడ్డగోలుగా టారిఫ్ లు వేస్తూ నరకం చూపిస్తుంటాడు.

చదువుతుంటే ఇప్పటికే అర్థమై ఉంటుంది అతడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని.. ఇటీవల భారత్ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సిందూర్ యుద్ధం చేసినప్పుడు.. పానకంలో పుడకలాగా వచ్చాడు. రకరకాల జిత్తుల మారి వ్యవహారాలకు పాల్పడి.. భారత్ పరోక్షంగా మూయించాడు. ఇప్పుడు ఏకంగా ఇరాన్ మీద కత్తి కట్టాడు. భారత్ అప్పుడు చేసింది తప్పు అని చెప్పిన శ్వేత దేశ అధిపతి.. ఇప్పుడేమో తనకు గిట్టని దేశం మీద పడ్డాడు. ఏకంగా ఇరాన్ అధ్యక్షుడిని టార్గెట్ చేసి మాట్లాడాడు. చంపేస్తా అంటూ హెచ్చరించాడు. అమెరికా ప్రయోజనాలు మాత్రమే కాదు, తన ప్రయోజనాలు కూడా చూసుకుంటాడు ట్రంప్. అందువల్లే తెర వెనుక రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. భారత్ ముందు పాకిస్తాన్ దేశాన్ని తిడుతుంటాడు. ఉగ్రవాద దేశమంటూ మండిపడుతుంటాడు. ఆ తర్వాత నాలుక మడత పెడుతుంటాడు. పాకిస్తాన్ కు తెర వెనుక సహాయం చేస్తూనే ఉంటాడు. తాజాగా పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడిని అమెరికాకు ఆహ్వానించాడు శ్వేత దేశ అధిపతి. అంతేకాదు అతనితో లంచ్ కూడా చేశాడు. పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్షుడిని శ్వేత భవనం దాకా తీసుకెళ్లాడు. క్యాబినెట్ రూంలో వారిద్దరూ ఇవాళ లంచ్ కూడా చేశారు. అయితే ఆ లంచ్ మొత్తం అత్యంత ప్రైవేట్ గా సాగింది. చివరికి ఈ భేటీకి విలేకరులను కూడా ఆహ్వానించలేదు. అంతేకాదు ఈ లంచ్ పూర్తి అయిన తర్వాత అమెరికా స్టేట్ సెక్రటరీ రూబియో, అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ తో మునీర్ భేటీ అయ్యాడు. ఇక ఆపరేషన్ సిందూర్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్న ట్రంప్.. ప్రపంచం ముందు గప్పాలు కొట్టాడు. ఆపరేషన్ సిందూర్ ను తానే ఆపివేసినట్టు ప్రచారం చేసుకున్నాడు. ఇక బుధవారం నాడు ట్రంప్, నరేంద్ర మోడీకి ఫోన్ కాల్ చేస్తే.. ఆపరేషన్ సిందూర్ విషయాన్ని ప్రస్తావిస్తే.. ఆ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని.. ఆపరేషన్ సిందూర్ కచ్చితంగా కొనసాగుతుందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

Also Read:   Donald Trump: ఉక్రెయిన్ పై దాడులు.. పుతిన్ పై ట్రంప్ సీరియస్

స్వదేశంలో నిరసనలు వ్యక్తమైనప్పటికీ

మునీర్ పర్యటన నేపథ్యంలో అమెరికా దేశంలో అతడికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అమెరికాలో స్థిరపడిన పాకిస్తాన్ సొంత దేశస్తులు మునీర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అతడిని పిరికి పందగా వ్యాఖ్యానించారు. అత్యంత అవినీతిపరుడని మండిపడ్డారు. దేశ ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్న అంటూ ఆరోపించారు.. దానికి సంబంధించిన వీడియోలను కూడా వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. ఇక గతంలో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనుచరులు కూడా మునీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంటూ, విదేశాలలో దాచుకుంటున్నాడని అతని మీద మండిపడ్డారు. ప్రపంచ దేశాల వద్ద అప్పులు తీసుకొచ్చి.. ప్రజల సంక్షేమం కోసం ఖర్చుపెట్టకుండా.. వాటిని దొడ్డిదారిన ఇతర దేశాలలో దాచుకుంటున్నాడని మునిర్ మీద ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఆరోపణలు చేశారు.. అతడు పాకిస్తాన్ దేశానికి పట్టిన శని అని మండిపడ్డారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version