https://oktelugu.com/

Tulsi Gabbard: తులసి.. ఇప్పుడు అమెరికాకు అన్నీ తనే. ఆమె ఆజ్ఞ లేనిది అగ్రరాజ్యంలో ఏదీ జరగదు..

మనదేశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాని తర్వాత హోం శాఖ మంత్రి అత్యంత పవర్ ఫుల్. అదే అగ్రరాజ్యం అమెరికా విషయానికి వస్తే అధ్యక్షుడి తర్వాత.. డిఫెన్స్ మినిస్టర్ అత్యంత పవర్ఫుల్. ఆ తర్వాత ఆ స్థాయిలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ శక్తివంతంగా ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 16, 2024 / 08:57 AM IST

    Tulsi Gabbard

    Follow us on

    Tulsi Gabbard: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత.. ఆయన మంత్రివర్గాన్ని నియమించుకుంటున్నారు. తనకు అనుకూలంగా ఉన్న వారికే పెద్ద పీఠ వేస్తున్నారు. మస్క్ దగ్గర నుంచి మొదలు పెడితే జేడీ వాన్స్ వరకు తనకు అండదండలు అందించిన వారికే పెద్ద పీట వేస్తున్నారు.. అయితే ఇందులో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా హిందూ మహిళ తులసి గబార్డ్ ను ట్రంప్ నియమించారు. ఈ పదవికి ఎంపికైన తొలి హిందూ అమెరికన్ మహిళగా తులసి రికార్డు సృష్టించారు. తులసిని నియామకం అనంతరం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి..” మన దేశం చాలా గొప్పది. మన ప్రజల స్వేచ్ఛ బాగుండాలి. దానికోసం తులసి 20 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు. గతంలో ఆమె డెమోక్రటిక్ పార్టీలో పని చేశారు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆమెకు రెండు పార్టీల సహచర్యం ఉంది. కచ్చితంగా ఆమె శాంతిని పరిరక్షిస్తారు. హక్కులను కాపాడుతారు. మన దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తారని నమ్మకం నాకుంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారంటే తులసి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.

    తులసి నేపథ్యం ఇదీ

    తులసి అమెరికాలోని టుటోలియా ద్వీపంలోని లీలోలా అనే గ్రామంలో 1981 ఏప్రిల్ 12న జన్మించారు. 21 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 9/11 దాడుల తర్వాత తులసి ఆర్మీ నేషనల్ గార్డులో ఎంట్రీ ఇచ్చారు. 2004లో అమెరికా ఇరాక్ పై చేసిన యుద్ధంలో పాల్గొన్నారు. ఆర్మీ రిజర్వ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. మేజర్ స్థాయి దాకా వెళ్లారు. లెఫ్టి నెంట్ కల్నల్ పదవి దాకా చేరుకున్నారు. 31 సంవత్సరాల వయసులోనే 2012 పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటారు. హవాయి కాంగ్రెషనల్ -2 ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా గెలుపును సొంతం చేసుకున్నారు. పార్లమెంట్ దిగువ సభకు నామినేట్ అయ్యారు. ఇలా ఆమె నాలుగు సార్లు ఎన్నికైన అనంతరం 2020లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి బైడన్ తో పోటీపడ్డారు. చివరికి నిష్క్రమించారు. పార్టీ నిర్ణయం మేరకు ఆయనకే మద్దతు ఇచ్చారు. ఇక ఇటీవల ఎన్నికల్లో ట్రంప్ విధానాలు నచ్చి అక్టోబర్ నెలలో రిపబ్లికన్ పార్టీలో చేరిపోయారు. ట్రంప్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

    యుక్త వయసులో హిందువుగా

    తులసి తల్లి ఇండియానా ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె తండ్రి యూరోపియన్ మూలాలు ఉన్న వ్యక్తి. తులసి తల్లిదండ్రులకు భారతదేశంతో సంబంధం లేకపోయినప్పటికీ వారు 1970 నుంచి హిందుత్వాన్ని ఆచరిస్తున్నారు. తమ కుమార్తెకు సంస్కృత పదమైన తులసి అనే పేరు పెట్టారు. ఆమెలో హిందుమూలాలు ఉండే విధంగా పెంచారు. అయితే తులసి పార్లమెంటుకు ఎన్నికైన ప్రతి సందర్భంలోనూ భగవద్గీత మీదనే ప్రమాణం చేయడం విశేషం. తులసి తండ్రి మైక్ గబార్డ్ గతంలో హవాయి సేనేటర్ గా పనిచేశారు. ట్రంప్ సూచనల మేరకు తులసి అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థకు డైరెక్టర్ గా రాట్ క్లిప్ ను ట్రంప్ నియమించారు. అతనితో కలిసి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా తులసి పనిచేయాల్సి ఉంటుంది. ఆమె కింద 18నిఘా సంస్థలు పనిచేస్తుంటాయి. ఆ సంస్థల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ.. వాటిని అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా మలచాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ట్రంప్ కు టూకీగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.. అయితే అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా తులసి ఏ మేరకు పనిచేస్తారనేది చూడాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.