Trump decapitation strategy: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతోంది. అమెరికా ఇరాన్ మీద దారుణంగా దాడులు చేస్తోంది.. శక్తివంతమైన బాంబులను ఉపయోగిస్తోంది.. అమెరికా సాగిస్తున్న యుద్ధం వల్ల ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది.. ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ రాజధాని, ఇతర ముఖ్య నగరాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
అమెరికా ఇరాన్ మీద దాడితోనే ఆగడం లేదని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ దేశాలలో నియంతలుగా ఉన్న వ్యక్తుల మీద అమెరికా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డి కాపిటేషన్ స్ట్రైక్ వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు మదు రో ను అమెరికా బంధించింది. ఇటీవల ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ మృతి చెందారు. వెనిజులా, ఇరాన్ తర్వాత అమెరికా ఉత్తర కొరియా మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఉత్తర కొరియాను కిమ్ జోంగ్ సంవత్సరాలుగా పరిపాలిస్తున్నారు. అయితే న్యూక్లియర్ వెపన్స్ కోసం ఉత్తరకొరియా భారీగా ఖర్చు పెడుతున్నది. ఉత్తరకొరియా వద్ద అత్యంత ప్రమాదకరమైన న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో.. గత ఏడాది పుతిన్ కు అండగా కిమ్ నిలిచారు. ఉత్తర కొరియా నుంచి సైనికులను రష్యా భూభాగం మీదకి పంపించారు. ఈ పరిణామం అమెరికాకు ఆగ్రహాన్ని కలిగించింది. గతంలో ట్రంప్, కిమ్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. అవి ఎటువంటి ఒప్పందాలు కుదరకుండానే ముగిసిపోయాయి.
ఇప్పుడు ట్రంప్ డి కాపిటేషన్ ప్రణాళికలను అమలు చేస్తున్న నేపథ్యంలో.. తదుపరి టార్గెట్ కిమ్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు తమ జోలికి అమెరికా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే కిమ్ హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి.
డి కాపిటేషన్ స్ట్రైక్ విభిన్నంగా ఉంటుంది. శత్రు దేశాలకు సంబంధించిన నాయకులను లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడులు చేస్తాయి. మనిషి శరీరానికి మెదడు అత్యంత ముఖ్యమైనది. అలాగే దేశానికి, సైన్యానికి నాయకత్వం కూడా అంతే ముఖ్యమైనది. ఆ నాయకత్వానికి అంతా తొలగించగలిగితే.. శత్రువును కచ్చితంగా అయోమయంలోకి నెట్టవచ్చు. ఆ దేశాన్ని స్తంభింప చేయవచ్చు. అవకాశం ఉంటే పూర్తిగా లొంగదీసుకోవచ్చు. ఈ వ్యూహంలో భాగంగానే మిస్సైల్స్, డ్రోన్ల ద్వారా కీలకమైన నాయకులను అంతం చేస్తారు. లేదా బందీలుగా తీసుకెళ్తారు. వెనిజులా లో మదురో ను అమెరికా బందీగా తీసుకెళ్లింది.