Homeఅంతర్జాతీయంDonald Trump: ట్రంప్‌పై హత్యాయత్నం.. నిందితుడి వీడియో విడుదల.. సీక్రెట్‌ సర్వీస్‌ లోపాలు బహిర్గతం!

Donald Trump: ట్రంప్‌పై హత్యాయత్నం.. నిందితుడి వీడియో విడుదల.. సీక్రెట్‌ సర్వీస్‌ లోపాలు బహిర్గతం!

Donald Trump: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన డిన్నర్‌లో కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచ పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికా అధ్యక్షుడి రక్షణ వ్యవస్థలో లోపాలు ఉండడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఏకంగా వైట్‌హౌస్‌లో కాల్పులు జరగపడం ట్రంప్‌ భద్రతా వ్యవస్థలో లోపాలను బయటపెట్టింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్న రహస్యాలను తెలియజేస్తోంది. కెమెరాల్లో నిక్షిప్తం.. ఏప్రిల్‌ […]

Donald Trump: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన డిన్నర్‌లో కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచ పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికా అధ్యక్షుడి రక్షణ వ్యవస్థలో లోపాలు ఉండడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఏకంగా వైట్‌హౌస్‌లో కాల్పులు జరగపడం ట్రంప్‌ భద్రతా వ్యవస్థలో లోపాలను బయటపెట్టింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్న రహస్యాలను తెలియజేస్తోంది.

కెమెరాల్లో నిక్షిప్తం..
ఏప్రిల్‌ 24న వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌ సందర్భంగా నిందితుడు అలెన్‌ భద్రతా గేట్‌ను దాటి కాల్పులు జరపడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఈ దాడిలో ఒక సీక్రెట్‌ సర్వీస్‌ అధికారి గాయపడ్డారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రుబియోలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు మార్చారు. ఈ వీడియోలు విచారణలో భాగంగా విడుదల చేసింది. ఈ ఘటన అమెరికా రాజకీయ, భద్రతా వ్యవస్థల్లో లోపాలను బయటపెట్టింది.

భద్రతా వైఫల్యం ఎలా జరిగింది?
నిందితుడు హోటల్‌ చెక్‌పాయింట్‌ను ఒక్కసారిగా దాటి దాడి చేయడం వీడియోల్లో స్పష్టం. ఇది సీక్రెట్‌ సర్వీస్‌ ప్రొటోకాల్స్‌లో తీవ్ర లోపాన్ని సూచిస్తోంది. హైప్రొఫైల్‌ ఈవెంట్‌లో ఇలాంటి దాడి జరిగడం అమెరికా రాష్ట్రపతి భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విచారణలు కొనసాగుతున్నాయి. నిందితుడి మోటివేషన్, సహాయకులు ఉండటం వంటివి త్వరలో తెలుస్తాయి. ఈ ఫుటేజ్‌ ప్రజలకు సంఘటనను అర్థం చేసుకునే అవకాశం ఇచ్చింది కానీ, భద్రతా లోపాలు బహిర్గతమయ్యాయి.

రాజకీయ, సామాజిక పరిణామాలు
ట్రంప్‌పై ఈ దాడి అమెరికా రాజకీయాల్లో మరింత విభేదాలకు దారితీస్తుంది. అధ్యక్షుడు, ఆయన కుటుంబం, కీలక మంత్రుల భద్రతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ దాడిని భద్రతావైఫల్యంగా విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది దేశంలో పోలారైజేషన్‌ను పెంచి, రాజకీయ హింసపై చర్చలకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా భద్రతా వ్యవస్థపై దృష్టి పడుతోంది. ఇలాంటి ఈవెంట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇమేజ్‌ను మరింత బలపరుస్తాయా లేక రాజకీయ శత్రుత్వాలను తీవ్రతరం చేస్తాయా? అనేది చూడాలి.

ఈ ఘటన సీక్రెట్‌ సర్వీస్‌లో సాంకేతిక అప్‌గ్రేడ్‌లు, ఏఐ మానిటరింగ్, పర్సనల్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ మార్చాల్సిన అవసరాన్ని చూపిస్తోంది. హైప్రొఫైల్‌ ఈవెంట్లకు మల్టీలేయర్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి. విచారణ ఫలితాలు రాజకీయ హింసను అరికట్టే చట్టాలకు దారితీయవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper