https://oktelugu.com/

Canada : కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం..

ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు అమెరికా తర్వాత ఆప్షన్‌ ఎంచుకునే దేశాల్లో కెనడా ముందంజలో ఉంటుంది. అక్కడి సదుపాయాల నేపథ్యంలో చాలా మంది బారతీయ విద్యార్థులు కెనడా యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 30, 2024 / 12:03 PM IST
    Follow us on

    Canada : విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు భారత్‌ నుంచి ఏలా వేలాది మంది భారతీయులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకేతోపాటు పలు దేశాలకు వెళ్లున్నారు. అమెరికా తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, యూకే దేశాలకే ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నారు. ఆయా దేశాల యూనివర్సిటీలు కూడా విదేశీ విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. ఇటీవల కెనడా, ఆస్ట్రేలియా నిబంధనలు కఠినతరం చేశాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ దేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వలసలను నియంత్రించేందుకు ఈ దేశాలు వీసా చార్జీలను భారీగా పెంచాయి. మరోవైపు ఇంటి అద్దెలను కూడా పెంచాయి. ఇక ఆయా దేశాలకు వెళ్లే విద్యార్థులు చూపించే బ్యాంకు బాలెన్స్‌ను కూడా రెట్టింపు చేశాయి. ఇక ఇప్పటికే వేల మంది కెనడా, ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో చదువుతున్నారు. అక్కడే పార్ట్‌టైం ఉద్యోగాలూ చేస్తున్నారు. ఇక విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు అక్కడ వివిధ కారణాలతో మృత్యువాత పడుతున్నారు. కొందరు స్థానికుల దాడుల్లో చనిపోతుంటే.. మరికొందరు.. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడుతున్నారు. కొందరు పర్యాటక ప్రదేశాలకు వెళ్లి నీట మునిగి చనిపోతున్నారు. ప్రయోజకులై వస్తారనుకున్న పిల్లలు విగత జీవులుగా.. శవపేటికల్లో రావడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు.

    ముగ్గురూ పంజాబ్‌ వాసులే..
    కెనడాకు వెళ్తున్న భారతీయుల్లో ఎక్కువగా పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారే ఉంటారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిలో ముగ్గురూ ఆ రాష్ట్రానికి చెందినవారే. మూడు కుటుంబాల్లో ఈ రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. న్యూ బ్రున్సివిక్ లోని మిల్ కోవ్‌లో వారు ప్రయాణిస్తున్న టాక్సీ టైరు పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులు ముగ్గురి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వారు పంజాబ్‌లోని లుథియానా జిల్లాలోని మలౌద్‌ గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులుగా గుర్తించారు, హర్మాన్‌ సోమల్‌(23), నవజ్యోత్‌ సోమల్‌(19) ఇద్దరూ సోదరులు. మూడవ బాధితురాలు సమనాకు చెందిన రష్మ్‌దీప్‌కౌర్‌(23)గా సంగ్రూర్‌ జిల్లాకు చెందిన యువతి. ఈమె తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వారు తమ శాశ్వత నివాస పత్రాలను సమర్పించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. టాక్సీ డ్రైవర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. హైవే 2లో జూలై 27న రాత్రి 9:35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

    టైరు పేలడంమే కారణం..
    రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసుల ప్రమాదంపై విచారణ చపట్టారు. ట్యాక్సీ టైర్‌ పేలడం వల్లనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. టైరు పేలిన తర్వాత డ్రైవర్‌ కారుపై నియంత్రణ కోల్పోవడంతో కారు పల్టీలు కొట్టిందని తెలిపారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులు కారులో నుంచి బయటకు ఎగిరిపడి మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను భారతదేశానికి స్వదేశానికి తరలించడంలో సహాయం చేయడానికి నిధుల సేకరిస్తున్నారు.

    ఇటీవలే కేంద్రం నివేదిక..
    ఇదిలా ఉంటే.. గడిచిన ఐదేళ్లలో విదేశాల్లో మృతిచెందిన వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఐదేళ్లలో 633 మంది భారతీయులు వివిధ కారణాలతో మృతిచెందినట్లు తెలిపింది. మృతుల్లో అత్యధికంగా కెనడాలో 172 మంది ఉన్నారని పేర్కొంది. ఇక అమెరికాలో 108 మంది మరణించారు. తాజాగా ముగ్గురి మృతితో కెనడాలో మరణించినవారి సంఖ్య 175కు చేరింది.