
Popular Dog Breeds : మనుషులకు, శునకాలకు ఉన్న సంబంధం ఈనాటిది కాదు. అత్యంత విశ్వాస పాత్రమైన జంతువులుగా శునకాలు పేరుపొందాయి. పూర్వం యుద్దాల నుంచి ప్రస్తుతం సామాజిక హోదాను ప్రదర్శించే దాకా శునకాలు మనుషులతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. రోజులు మారుతున్న కొద్దీ శునకాల్లోనూ మార్పులు వచ్చాయి. ఈ మార్పులు వచ్చాయి అనేకంటే మనుషులు తమకు అనుకూలంగా శునకాల్లో మార్పులు తీసుకొచ్చారు అనడం సబబు. కాలం మారుతున్న కొద్దీ మనిషి సామాజిక హోదాలో అనితర సాధ్యమైన మార్పులు రావడంతో శునకాలను పెంచే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. అయితే శునకాల తెలివితేటల ఆధారంగా వాటిల్లో టాప్ 5 జాతులుగా వర్గీకరించారు..
లాబ్రడార్ రిట్రీవర్
ఈ జాతి శునకాలు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. విధేయతను కలిగి ఉంటాయి. మనుషులు ఏం చెప్పినా త్వరగా నేర్చుకుంటాయి. తమ చిలిపి చేష్టలతో యజమానులను ఆకట్టుకుంటాయి. వీటిలో చురుకుదనం చాలా ఎక్కువ. క్రీడల్లో కూడా రాణించగలవు. ఇంట్లో కలివిడిగా తిరగగలవు.. మనుషులతో సరదాగా ఆడుకుంటాయి. వస్తువులతో కూడా చిలిపి చేష్టలు చేస్తాయి.
జర్మన్ షెఫర్డ్
జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కలు చాలా తెలివైనవి. విశ్వాస పాత్రమైనవి. సంక్లిష్టమైన పనులు చేయడంలో వీటి తరువాతే మిగతా జాతులు. వీటిని పోలీస్ కుక్కలుగా పిలుస్తుంటారు. ముఖ్యమైన వ్యక్తుల భద్రతా వ్యవహారాల్లో ఇవి పాలుపంచుకుంటాయి. సైన్యానికి కూడా విరివిగా సేవలందిస్తున్నాయి. పోలీస్ జాగిలాలుగా మందు పాతరలు, క్లిష్టమైన కేసుల్లో ఆనవాళ్ళను గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. వీటిని ఒక రకంగా సేవ కుక్కలు అని కూడా పిలుస్తుంటారు.

పూడ్లే
ఈ రకానికి చెందిన కుక్కలు చాలా తెలివైనవి. యజమానుల చుట్టూ తిరుగుతుంటాయి . వారిని సంతోష పెట్టేందుకు తెగ తాపత్రయపడుతుంటాయి. వీరవిదేతను ప్రదర్శిస్తాయి. అందంగా ఉండటంవల్ల ఈ జాతిని కొనుగోలు చేసేందుకు మనుషులు ఉత్సాహం చూపిస్తారు. చురుకుదనం వంటి కేటగిరి పోటీల్లో ఇవి రాణిస్తాయి. వీటిని “థెరపీ డాగ్ లు” అని కూడా పిలుస్తారు.
బోర్డర్ కోలీ
ఈ రకానికి చెందిన కుక్కలు అత్యంత శక్తివంతమైనవి. చాలా తెలివైనవి కూడా. వీటిలో చురుకుదనం పాళ్ళు ఎక్కువ. వీరవిధేయతను ప్రదర్శిస్తాయి. క్రీడల్లో విశేషంగా రాణిస్తాయి. వీటిని పశువుల పెంపకం దారులు జాగిలాలుగా ఉపయోగిస్తుంటారు. ఇవి కృష్ణమైన పనులు చేయగలవు. కాపలా కుక్కలుగా ఇవి పేరుపొందాయి.
గోల్డెన్ రిట్రివర్
ఇవి చాలా స్నేహపూర్వకమైనవి. తెలివైనవి కూడా. ఏదైనా చెబితే వెంటనే నేర్చేసుకుంటాయి. ఇవి విధేయతను ప్రదర్శిస్తాయి. చాలా చురుగ్గా ఉంటాయి. ఇతర దేశాలలో వీటిని క్రీడా వినోదం కోసం పెంచుకుంటారు. ఇవి థెరపీ డాగ్ లుగా పేరు పొందాయి. అందంగా ఉండటం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు ఇతర దేశాల వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

ఇవే కాకుండా డాబర్మాన్ ఫినిషర్ ప్రసిద్ధి చెందిన కుక్క. వీటిని పోలీసు కుక్కలుగా ఉపయోగిస్తారు. విధేయత, చురుకుదనంలో వీటికి ఇవే సాటి. ఎంతటి క్లిష్టమైన పనులైనా సులభంగా చేయగలవు. వీటికి ఘ్రాణ శక్తి చాలా ఎక్కువ. చాలా విశ్వాసంగా ఉంటాయి. బలంగా ఉండటం వల్ల కాపలా కుక్కలుగా ఉపయోగిస్తారు. విదేశాల్లో వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇక సామాజిక హోదా పెరిగిన నేపథ్యంలో కుక్కలను సంపన్నులే కాదు మధ్యతరగతి వాళ్ళు కూడా పెంచుకుంటున్నారు. కాపలా కోసమే కాకుండా ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేందుకు వాటిని పోషిస్తున్నారు.. ముఖ్యంగా సంపన్నులు కాపలా కోసం ఒక జాతిని, ఇంట్లోకి మరొక జాతిని పెంచుకుంటున్నారు. వారికి ఉన్న స్తోమత ఆధారంగా కుక్కలను పెంచుకునేందుకే ప్రత్యేకంగా మనుషులను నియమించుకుంటున్నారు. ఒకప్పుడు పరిస్థితులు బాగా లేకపోతే జీవిత మంతా “కుక్క బతుకు” అయుపోయిందనే సామెత వాడేవారు..పై కుక్కల తీరు తెలిసిన తర్వాత ఆ సామెత వాడటం అనవసరం. ఎందుకంటే వాటి బతుకు మనుషుల కంటే నయంగా ఉంది.