Homeఅంతర్జాతీయంTop Media Organizations: వాషింగ్టన్ పోస్ట్ కాదు.. బీబీసీ అంతకన్నా కాదు.. ప్రపంచంలో టాప్ మీడియా...

Top Media Organizations: వాషింగ్టన్ పోస్ట్ కాదు.. బీబీసీ అంతకన్నా కాదు.. ప్రపంచంలో టాప్ మీడియా సంస్థలు ఇవే..

Top Media Organizations: నేటి సాంకేతిక కాలంలో కూడా మీడియా ఆధారంగానే ప్రపంచం మనగడ కొనసాగుతోంది. మీడియా ఎన్ని రకాలుగా మారిపోయినప్పటికీ.. ప్రజలలో చులకన భావం పెరిగిపోతున్నప్పటికీ.. మీడియా అనేది ఇప్పటికీ విశ్వసినీయంగానే కొనసాగుతోంది. మీడియా ప్రస్తావన వస్తే అందులో అగ్రశ్రేణి సంస్థల గురించి కచ్చితంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ ను ప్రఖ్యాత మీడియా సంస్థలుగా పేర్కొంటారు. కానీ వాస్తవానికి ఆ మూడు సంస్థలు కానే కావు. వాస్తవానికి సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రింట్ మీడియాకు ఆదరణ తగ్గింది. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా వృద్ధి చెందినప్పటికీ.. డిజిటల్ మీడియా ప్రస్తుతం సంచలనం రేపుతోంది. వివిధ మాధ్యమాలలో ఏ సంస్థలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ఏడాది ఈ నెల వరకు అందుబాటులో ఉన్న మార్కెట్ క్యాపిటల్లైజేషన్ గణాంకాల ప్రకారం.. టాప్ స్థానంలో ఉన్న మీడియా సంస్థలు ఏవంటే..

1.కామ్ కాస్ట్

ప్రధాన కార్యాలయం: ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా.

ఆదాయం: జూన్ 30 2025 నాటికి 124.18 బిలియన్ డాలర్లు.

నికర ఆదాయం: జూన్ 3O, 2025 నాటికి 22.9 బిలియన్ డాలర్లు.

మార్కెట్ క్యాప్: అక్టోబర్ 21 2025 నాటికి 110.66 బిలియన్ డాలర్లు.

2025 అక్టోబర్ 20 నాటికి 26.38 శాతం తక్కువ రాబడిని నమోదు చేసినప్పటికీ ఈ సంస్థ ప్రపంచంలోనే అగ్రశ్రేణి మీడియా కంపెనీగా వెలుగొందుతోంది.

ఎక్స్ చేంజ్: నాస్టాక్

కామ్ కాస్ట్ అనేది ఒక మీడియా కంపెనీ. ఆదాయం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార, కేబుల్ టెలివిజన్ సంస్థగా వెలుగొందుతోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో NBC news, MSNBC, CNBC, యునైటెడ్ కింగ్ డమ్ ప్రాంతంలో sky News అనే సంస్థలను నిర్వహిస్తోంది.

2.థామ్సన్ రాయిటర్స్

ప్రధాన కార్యాలయం: టొరంటో, ఒంటరియో, కెనడా

ఆదాయం: 7.32 బిలియన్ డాలర్లు (జూన్ 30, 2025 నాటికి)

నికర ఆదాయం: 1.63 బిలియన్ డాలర్లు (జూన్ 30, 2025 నాటికి)

మార్కెట్ క్యాప్: 72.57 బిలియన్ డాలర్లు (అక్టోబర్ 21, 2025 నాటికి)

రాబడి: గత ఏడాదితో పోల్చి చూస్తే ఇప్పటివరకు 3.2 టు శాతం తక్కువ నమోదు చేసింది (అక్టోబర్ 20, 2025 నాటికి)

ఎక్స్చేంజ్: నాస్డాక్

3.నాస్పర్స్

ప్రధాన కార్యాలయం: కేప్ టౌన్, దక్షిణాఫ్రికా

ఆదాయం: 7.18 బిలియన్ డాలర్లు(మార్చి 31, 2025 నాటికి)
నికర ఆదాయం: 5.24 బిలియన్ డాలర్లు(మార్చి 31, 2025 నాటికి)

మార్కెట్ క్యాపిటలైజేషన్: 53.84 బిలియన్ డాలర్లు (అక్టోబర్ 21, 2025 నాటికి)

రాబడి: గత ఏడాదితో పోల్చి చూస్తే 47.47 అధిక ఆదాయాన్ని సంపాదించింది (అక్టోబర్ 20, 2025 నాటికి)

ఎక్స్ చేంజ్: ఓటీసీ మార్కెట్

4.వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ

ప్రధాన కార్యాలయం: న్యూయార్క్

ఆదాయం: 38.44 బిలియన్ డాలర్లు(జూన్ 30, 2025 నాటికి)

నికర ఆదాయం: 77 బిలియన్ డాలర్లు (జూన్ 30, 2025 నాటికి)

మార్కెట్ క్యాప్: 50.33 బిలియన్ డాలర్లు (అక్టోబర్ 21, 2025 నాటికి)

రాబడి: అక్టోబర్ 20 2025 నాటికి క్రితంతో పోల్చి చూస్తే 134.27 శాతం ఆదాయాన్ని ఆర్జించింది.

ఎక్స్చేంజి: నాస్డాక్

5.ఫాక్స్ కార్ప్

ప్రధాన కార్యాలయం: న్యూయార్క్

ఆదాయం: జూన్ 30, 2025 నాటికి 16.3 బిలియన్ డాలర్లు.

నికర ఆదాయం: జూన్ 30 2025 నాటికి 2.26 బిలియన్ డాలర్లు.

మార్కెట్ క్యాప్: అక్టోబర్ 21, 20 2025 నాటికి 23.41 బిలియన్ డాలర్లు.

రాబడి: అక్టోబర్ 20, 2025 నాటికి 35.13 శాతం అధిక ఆదాయాన్ని సంపాదించింది.

ఎక్స్చేంజ్: నాస్డాక్

6.బీసీఈ

ప్రధాన కార్యాలయం: క్యూబిక్, కెనడా

ఆదాయం: జూన్ 30, 2025 నాటికి 24.41 బిలియన్ డాలర్లు.

నికర ఆదాయం: 43 మిలియన్ డాలర్లు.(జూన్ 30, 2025 నాటికి)

మార్కెట్ క్యాప్: 31.31 బిలియన్ డాలర్లు (అక్టోబర్ 21, 2025 నాటికి)

రాబడి: -21.51%(అక్టోబర్ 20, 2025 నాటికి)

ఎక్స్చేంజి: న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్.

7.రోజర్స్ కమ్యూనికేషన్స్

ప్రధాన కార్యాలయం: కెనడా

ఆదాయం: జూన్ 30, 2025 నాటికి 20.80 బిలియన్ డాలర్లు.

నికర ఆదాయం: జూన్ 30, 2025 నాటికి 1.52 బిలియన్ డాలర్లు.

మార్కెట్ క్యాప్: 19.97 బిలియన్ డాలర్లు. (అక్టోబర్ 21, 2025 నాటికి)
రాబడి: -2.67%(అక్టోబర్ 20, 2025 నాటికి)

ఎక్స్చేంజ్: న్యూయార్క్ స్టాక్ ఎక్స్ చేంజ్

8.పారా మౌంట్ స్కై డాన్స్

ప్రధాన కార్యాలయం: లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా

ఆదాయం: జూన్ 30, 2025 నాటికి 28.76 బిలియన్ డాలర్లు.

నికర ఆదాయం: జూన్ 30, 2025 నాటికి -3 బిలియన్ డాలర్లు.

మార్కెట్ క్యాప్: అక్టోబర్ 21, 2025 నాటికి 18.10 బిలియన్ డాలర్లు

రాబడి: 64.50(అక్టోబర్ 20, 2025 నాటికి)

ఎక్స్చేంజి: నాస్డాక్

9.న్యూస్ కార్ప్

ప్రధాన కార్యాలయం: న్యూయార్క్

ఆదాయం: జూన్ 30, 2025 నాటికి 8.45 బిలియన్ డాలర్లు.

నికర ఆదాయం: జూన్ 30, 2025 నాటికి 1.18 బిలియన్ డాలర్లు.

మార్కెట్ క్యాప్: అక్టోబర్ 21, 2025 నాటికి 16.83 బిలియన్ డాలర్లు.

రాబడి: అక్టోబర్ 20, 2025 నాటికి 8.03 శాతం.

ఎక్స్చేంజ్: నాస్డాక్

10.ది న్యూయార్క్ టైమ్స్ కంపెనీ

ప్రధాన కార్యాలయం: న్యూయార్క్

ఆదాయం: జూన్ 30, 2025 నాటికి 2.69 బిలియన్ డాలర్లు.

నికర ఆదాయం: జూన్ 30 2025 నాటికి 32 మిలియన్ డాలర్లు.

మార్కెట్ క్యాప్: అక్టోబర్ 21, 2025 నాటికి 9.19 బిలియన్ డాలర్లు

రాబడి: అక్టోబర్ 20, 2025 నాటికి 2.36 శాతం.

ఎక్స్చేంజి: న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular