https://oktelugu.com/

China : 2020 ఇలానే చైనా వైరస్ తో మొదలైంది.. 2025లోనూ ఇదే రిపీట్ అవుతుందా..

కొన్నిసార్లు మనం అనుకోనివి జరుగుతాయి. జరగకూడదు అనుకున్నవి జరుగుతుంటాయి. కాలాన్ని మనం ఆపలేం.. జరిగే సంఘటనను నిలువరించలేం.. జస్ట్ మనం మనుషులం.. నిమిత్తమాత్రులం. కాకపోతే జరిగే ఘటనల వల్ల నష్టపోయేది మనమే. ఒక్కోసారి మన ప్రాణాలు పోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. ఆస్తి నష్టం జరగవచ్చు.. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. చదవండి ఈ కథనం మీకే తెలుస్తుంది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 5, 2025 / 11:19 PM IST

    China New Virus

    Follow us on

    China :  మన పక్కనే ఉన్న చైనా అనేది ఎంత దిక్కుమాలిన దేశమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవసరాల ప్రాతిపదికనే ఆ దేశం కార్యకాలపాలు సాగిస్తుంటుంది. పైగా కమ్యూనిస్టు పార్టీ అక్కడ అధికారంలో ఉంది. ప్రజాస్వామ్యం అనేది కనిపించదు. స్థూలంగా చూస్తే అధ్యక్షుడు మాత్రమే అక్కడ సుప్రీమ్. అతడు ఏం చెప్తే అక్కడ అది నడుస్తుంది. కాదు కూడదని మాట్లాడితే జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అధ్యక్షుడికి గనుక తిక్క రేగితే ఉరి కంబానికి వేలాడాల్సి ఉంటుంది. ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదగాలని చైనా ఎప్పటినుంచో భావిస్తోంది. అమెరికన్ సైతం పక్కన పెట్టాలని అనుకుంటున్నది. ఇందులో భాగంగానే అనేక రకాల కుయుక్తులను పన్నుతున్నది. గ్లోబల్ మీడియా కథనాల ప్రకారం చైనా నుంచే 2020లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. ఇందులో రకరకాల వేరియంట్లు ప్రపంచం మీద తీవ్రంగా ప్రభావం చూపించాయి. తొలి వేరియంట్ కంటే, రెండవ వేరియంట్ ప్రపంచానికి నరకం చూపించింది. లక్షల మంది చనిపోయారు.. అంతే సంఖ్యలో చాలామంది తమ బంధువులను కోల్పోయారు. అంతిమ సంస్కారాలు కూడా ఘనంగా నిర్వహించలేకపోయారు.. అయితే నాడు చైనా దాదాపు మూడు సంవత్సరాల పాటు తమ దేశంలో లాక్ డౌన్ విధించింది. తమ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు నాటి రోజులే వచ్చాయా? అలాంటి పరిస్థితులను ప్రపంచం మరోసారి చవి చూడాల్సి ఉంటుందా.. ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు వినిపించినప్పటికీ.. అంతిమంగా జరిగేవి అవేనని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

    వైరస్ తో స్వాగతం

    2020 సంవత్సరంలో వైరస్ తోనే ప్రపంచం స్వాగతం పలికింది. ఆ ఏడాది తొలిసారిగా చైనా దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసింది. ఇప్పుడు ఈ ఏడాది కూడా వైరస్ తోనే మొదలైంది. అంటే ఈ ఏడాది కూడా 2020 మాదిరిగానే మారుతుందా అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో జనవరి ఒకటో తేదీ బుధవారం నాడు వచ్చింది. 2025 లోనూ అదే పునరావృతమైంది. నాడు కరోనా చాలామంది ప్రాణాలు తీసింది. దేశాల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. వ్యక్తుల ఆర్థికముఖ చిత్రంలోని కూడా పాతాళంలోకి తోసేసింది.. ఇప్పుడు HM PV వైరస్ మనదేశంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. అసలు ఇప్పుడు శీతాకాలం.. పైగా కొంతకాలంగా జలుబు, దగ్గు కూడా జనాలకు విపరీతంగా ఉంది. న్యూమోనియాతో బాధపడేవారు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో అలాంటివారికి తాజా వైరస్ వల్ల ఇబ్బంది ఎదురుకాక తప్పదని వైద్యులు అంటున్నారు. వైరస్ గురించి.. దాని లక్షణాల గురించి తెలియక పోయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.