US Iran Tension: ఇరాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దీంతో దేశంలోని 73 నగరాల్లో ధరల పెరుగుదలపై ప్రజలు పోరాడుతున్నారు. ప్రభుత్వం నిరసనలను అణచివేస్తోంది. దీంతో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణించారు. దీంతో అమెరికా రంగంలోకి దిగింది. నిరసనలను అణచివేస్తే దాడిచేస్తామని ఇరాన్‌ను హెచ్చరించింది. మరోవైపు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. ఈ క్రమంలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా ఆగిపోయాయి. అస్థిరతను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు డిజిటల్ అవరోధాలను పెంచారు.
గురువారం రాత్రి నుంచి బ్లాక్‌ఔట్
గురువారం రాత్రి నుంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ దాదాపు నిలిచిపోయింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వెబ్ సైట్‌లు అందుబాటులో లేకపోవడంతో పౌరులు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని విషయాలు బయటకు వెళ్లకూడదనే ఖమేనీ ప్రభుత్వం ఇలా చేసిందని తెలుస్తోంది. దీంతో సమాచార ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది.
నిరసనలు వైరల్..
ధరల పెరుగుదలపై ఆందోళన చేస్తున్న నిరసనకారులు.. ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ ఘటనలతో ప్రభుత్వ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.
ట్రంప్ హెచ్చరిక..
సోషల్ మీడియా పోస్ట్‌లో ట్రంప్ ‘ఇరాన్ ప్రభుత్వం ప్రజలను లక్ష్యంగా చేసుకుని చంపితే, దాడి తప్పదని వార్నింగ్ ఇచ్చారు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇరాన్ పౌరులు అసాధారణ ధైర్యవంతులు. యాచనలు చేస్తూ కూడా కొందరు ప్రాణాలు కోల్పోవచ్చు, కానీ ఉద్దేశపూర్వక హింసాకు భారీ మూల్యం చెల్లించాల్సిందే‘ అని స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. డెమోక్రటిక్ నాయకులు దీనిని ‘అధికార దుర్వినియోగం‘గా విమర్శించగా, రిపబ్లికన్లు ‘మానవహక్కుల మద్దతు‘గా స్వాగతించారు. ఐక్యరాష్ట్ర సమితి, యూరోపియన్ యూనియన్ ఇరాన్‌పై ఇప్పటికే ఆర్థిక ఒత్తిడి పెంచాయి. ఈ హెచ్చరిక ఇరాన్ అధికారుల చర్యలను మార్చేలా, ప్రపంచ దృష్టిని మరింత ఆకర్షించేలా పనిచేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా అమెరికా మరో దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.