Homeఅంతర్జాతీయంCardrona Bra Fence: అక్కడ ఒంటిపై నూలుపోగు కూడా ఉంచుకోరు.. ఎగబడి వెళ్తున్న అమ్మాయిలు!

Cardrona Bra Fence: అక్కడ ఒంటిపై నూలుపోగు కూడా ఉంచుకోరు.. ఎగబడి వెళ్తున్న అమ్మాయిలు!

Cardrona Bra Fence: ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం, విశ్వాసం పాటిస్తారు. అయితే భారత్‌లోనే ఎక్కువ కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉన్నాయని చాలా మంది భావిస్తారు. అందుకే పాశ్చాత్య దేశాలను మన సంస్కృతి సంప్రదాయాలను బాగా ఇష్టపడుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో మన కంటే ఎక్కువే కట్టుబాట్లు.. వింత సంప్రదాయాలు ఉన్నాయి. ఆయా సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా ఆ ప్రాంతాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. మనం తెలుసుకోబోయే ప్రాంతం కూడా అలాంటిదే. అక్కడకు ఎంతో మంది అమ్మాయిలు వస్తారు. బట్టలన్నీ విప్పేసి తమ బ్రాలను అక్కడి ఓ ఇనుప తీగకు వేలాడదీస్తారు. ఇలా చేస్తే మంచి వ్యక్తి భర్తగా వస్తాడని నమ్ముతారు. మరి ఈ పర్యాటక కేంద్రం ఎక్కడుంది.. అక్కడి నమ్మకానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం.

న్యూజిలాండ్‌లో ఈ టూరిస్ట్‌ ప్లేస్‌..
ఇక మనం చెప్పుకున్న ఆ టూరిస్టు ప్లేస్‌ న్యూజిలాండ్‌లోని సెంట్రల్‌ ఒటాగోలో కార్డోనా అనే ప్రాంతంలో ఉంది. బ్రాఫెన్స్‌ కారంణంగా ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడికి వచ్చే మహిళలు తమ దుస్తుల లోపల వేసుకున్న బ్రాలను తీసి కంచెకు తగిలేస్తారు. బ్యాగులో ఉన్నవి తీసి వేలాడదీయరు. ఒంటిపై ఉన్నవి మాత్రమే కంచె ఎదురుగా నిలబడి విప్పేస్తారు. తర్వాత దానిని ఆ కంచెకు వేలాడదీసి వెళ్లిపోతారు. నిత్యం వందల మంది ఇక్కడకు వచ్చి ఇలా చేస్తారు. దీని కారణంగా ఈ ప్రాంతం ప్రర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడకు వచ్చిన ప్రతీ యువతి ఈ సంప్రదాయం పాటిస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఫాలో అవుతారు.

స్థలం గురించి కథనాలు..
ఇక అమ్మాయిలు బ్రాలను వేలాడదీయడానికి ఒక బలమైన కారణం ఉందట. అక్కడున్న తీగపై బ్రాను వేలాడదీస్తే.. తాము ఇష్టపడే వ్యక్తే జీవిత భాగస్వామిగా వస్తాడని అక్కడి ప్రజలు విశ్వసిప్తారు. మంచి వాడు భర్తగా వస్తాడని నమ్ముతారు. ఈ సంప్రదాయం గురించి తెలిసి ఎందరో విదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి బ్రాను వదిలేసి వెళ్తున్నారు. 1999లో మొదటిసారి నాలుగు బ్రాలు వేలాడుతూ కనిపించాయని స్థానికులు చెబుతారు. వాటిని ఎవరు వేలాడదీశారు అనేది ఎవరికీ తెలియదు. కానీ, తర్వాత తీగలపై బ్రాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వాటిని చూసి అక్కడకు వచ్చిన వాళ్లు బ్రాను వదిలేసి వెళ్లడం కొనసాగుతూ వస్తోంది.

చోరీ కూడా పెరిగింది..
ఇక కొంతకాలంగా ఇక్కడ బ్రాల చోరీ కూడా పెరిగింది. రాత్రిపూట కొందరు దొంగలు వచ్చి బ్రాలను ఎత్తుకెళ్తున్నారు. ఈ ఘటనల తర్వాత ఈ ప్రదేశానికి ఆదరణ మరింత పెరిగింది. బ్రాలు చోరీ కావడంతో ఎక్కువ మంది వచ్చి మళ్లీ వేలాడదీసి వెళ్తున్నారు. న్యూజిలాండ్‌తోపాటు విదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి బ్రాలు విప్పేసి కోరికలను కోరుకుని వేలాడదీసి వెళ్తున్నారు. ఇలా వేసినవారిలో చాలా మంది కోరికలు నెరవేరాయట. అందుకే దీనికి ఆదరణ పెరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular