Prabhas: ఇండియాలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్… ప్రస్తుతం ఈయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నాడు.ఇక అందులో భాగంగానే ఇప్పుడు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీద కి వెళ్తుంది అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈ సినిమా మాత్రం ఒక పిరియాడికల్ డ్రామా మూవీగా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానులు మాత్రం ఒక విషయంలో తీవ్రంగా నిరాశపడుతున్నారు. అదేంటి అంటే ఇప్పటి వరకు హను రాఘవపూడి ఒక్క పెద్ద హీరోతో కూడా సినిమా చేయలేదు. అలాంటిది ప్రభాస్ ఆయనకు ఎలా సినిమా అవకాశాన్ని ఇచ్చాడని. సరే ఇచ్చిన పర్లేదు కానీ ఆయన ప్రభాస్ స్టార్ డమ్ ను మ్యాచ్ అయ్యేలా సినిమా చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది.
అది ఏంటి అంటే హను రాఘవపూడి ప్రబాస్ కి చెప్పిన కథ చాలా ఎమోషనల్ గా ఉందట. అలాగే ప్రభాస్ సవతి తల్లి దగ్గర పెరగడం వల్ల ఆ తల్లి అంటే ఆయనకి చాలా ఇష్టం ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇది చాలా కీలక పాత్ర వహిస్తుందని చెబుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఇంతకుముందు రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ఛత్రపతి సినిమా కూడా తల్లి కొడుకుల సెంటిమెంటుతో తెరకెక్కిందే కావడం విశేషం..
ఇక ఇప్పుడు ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్య పోలికలైతే వస్తున్నాయి. మరి ఛత్రపతి సినిమాలో ఎమోషన్స్ తో పాటు, ఎలివేషన్స్ కూడా పీక్ స్టేజ్ లో ఉంటాయి. కాబట్టి ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. మరి ఈ సినిమాలో కూడా ఎమోషన్స్, ఎలివేషన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ హను రాఘవపూడి ఈ సినిమాని ముందుకు నడిపిస్తాడా లేదా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది…