Stolen Indian Idols: భారత దేశం వేల ఏళ్ల చరిత్ర కలిగిన దేశం. మన దేశ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం. ఇక ఒకప్పుడు భారత్ సంపదతో తులతూగేది. ఆర్థికంగా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండేది. అయితే వలసవాదులు, రాజులు, నవాబుల దాడులతో మన సంపదను దోచుకుపోయారు. అనేక విలువైన విగ్రహాలను ధ్వంసం చేశారు. చాలా విగ్రహాలను తరలించుకుపోయారు. కొందరు భారతీయులు కూడా మన దేశా విగ్రహాలను అక్రమంగా ఇతర దేశాలకు అమ్ముకున్నారు. బ్రటిష్ కాలంలో ఈ స్మగ్లింగ్ ఎక్కువగా జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా విగ్రహాల తరలింపు కొనసాగింది.
విగ్రహాలు తీసుకురావడానికి..
భారత్ నుంచి తరలించుకుపోయిన విగ్రహాలను తిరిగి తీసుకురావడానికి భారత్ పెద్ద ఉద్యమమే చేస్తోంది. ఇందులో భాగంగా అనేక దేశాలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో ఒక విజయం సాధించింది. అమెరికాలోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్స్ మూడు హిందూ విగ్రహాలను తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది.
ఉద్యమ విజయం..
భారత ఉద్యమకారులు అంతర్జాతీయ చట్టాలు, డిప్లొమసీ ద్వారా విగ్రహాలను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మ్యూజియంపై ఒత్తిడి, చర్చలు ఫలితాలు ఇచ్చాయి. ఈ క్రమంలో అమెరికాలోని స్మిత్ సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్స్ మూడు విగ్రహాలను తిరిగి ఇవ్వడానికి సుముఖత తెలిపింది.
అరదైన విగ్రహాలు..
అమెరికా భారత్కు తిరిగి అప్పగిస్తున్న విగ్రహాలు చాలా అరుదైనవి. ఒకటి 12 శతాబ్దం నాటి సోమస్కందమూర్తి విగ్రహం. ఇందులో శివుడు, కుమారస్వామి కలిసి ఉంటారు. ఇక రెండోది 16వ శతాబ్దం నాటి అరుదైన శివపార్వతుల విగ్రహం. మూడోది 990వ సంవత్సరం నాటి నటరాజ స్వామి విగ్రహం. ఈ మూడు విగ్రహాలు త్వరాలోనే భారత్కు తిరిగి రానున్నాయి.
విగ్రహాలు తిరిగి తీసుకురావడం భారత వారసత్వాన్ని బలోపేతం చేస్తాయి. టూరిజం పెరిగి, దేశీయ గర్వం పెంచుతాయి. భవిష్యత్తులో మరిన్ని విగ్రహాలను తీసుకువచ్చే అవకాశం ఉంది.