Telugu Speakers in India: తెలుగు భాష ఎంతో కమ్మనైనది అని పండితులు చెబుతూ ఉంటారు. తెలుగు భాషలో ఆప్యాయత.. మర్యాద వంటివి కనిపిస్తూ ఉంటాయి. చాలామంది తెలుగు మాట్లాడాలని ఉద్యమాలు చేశారు. అయితే నేటి కాలంలో పాశ్చాత్త దేశాలకు వెళ్లాలని కోరికతో తెలుగు భాషను పట్టించుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే ఉండే కొందరు తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచంలో చాలామంది తెలుగువారు స్థిరపడిపోయారు. వీరిలో కొందరు తెలుగు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అయితే మన దేశంలో ఎంతమంది తెలుగు మాట్లాడుతున్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? ఆ వివరాలు కి వెళ్తే..
Also Read: India Poverty : దేశంలో తగ్గిపోయిన పేదరికం.. ఎస్‌బీఐ నివేదికలో కీలక విషయాలివీ!
భారతదేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్నీ కలిపి ఎనిమిది కోట్ల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. వీరికి ఇతర భాషలు వచ్చినా.. తెలుగు మాత్రమే మాట్లాడుతారు. వీరిలో రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే.. తమిళనాడులో 5.8% తెలుగు మాట్లాడే వారున్నారు. కర్ణాటకలో 5.9% తెలుగు మాట్లాడుతారు. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో 13.2% తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో 75.8% తెలుగు మాట్లాడుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో 89.2% తెలుగు మాట్లాడుతూ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఇతర భాషల వారు ఉన్నా.. తెలుగు మాత్రమే మాట్లాడడానికి ఆసక్తి చూపేవారు చాలామంది ఉన్నారు.
తెలుగు మాట్లాడడం వల్ల ఎంతో సంతృప్తిగా ఉంటుందని కొందరు భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా తెలుగులో తీయదనం కనిపిస్తుందని చెబుతారు. ఏ ఇతర భాషకు లేని అందం తెలుగు భాషకు ఉంటుంది. అంతేకాకుండా తెలుగువారు ఎక్కడ కనిపించినా ఆప్యాయతో పలకరిస్తారు. మర్యాదను చూపిస్తారు.
Also Read: India-China : భారత్ కు చైనా రెడ్ కార్పెట్ వెనుక అసలు కారణమిదే
అయితే కొందరు తెలుగు మాట్లాడానికి వెనకాడుతారు. వారి అవసరాలకు.. లేదా ఇతర పనుల కోసం ఇతర భాషలను మాట్లాడుతారు. ఎన్ని ఇతర భాషలు మాట్లాడిన తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడే వారు చాలామంది ఉన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో మిగతా దేశాల్లో ఉన్నవారు సైతం తెలుగు మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. అయితే పాఠశాలల్లో తెలుగు భాష పై తక్కువగా చూస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మిగతా భాషలకు ఇచ్చిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. కొన్ని పాఠశాలల్లో అయితే తెలుగు గురించి చెప్పడమే లేదని అంటున్నారు. ఇలా అయితే రానున్న రోజుల్లో తెలుగు గురించి చాలామంది మర్చిపోయా అవకాశం ఉంటుంది. అందువల్ల తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కొందరు పండితులు చెబుతున్నారు.