https://oktelugu.com/

America H-1B Visa : అమెరికా హెచ్‌–1బీ వీసాలో మరో మోసం.. తెలుగు వ్యక్తిపై అభియోగాలు..!

అమెరికా వెళ్లేందుకు భారతీయులు అడ్డదారులు తొక్కుతున్నారు. అగ్రరాజ్యాన్నే బురిడీ కొట్టిస్తున్నారు. హెచ్‌–1బీ వీసాల విషయంలో చీటింగ్‌ చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 10, 2024 / 03:07 AM IST

    America H-1B Visa

    Follow us on

    America H-B Visa :  అమెరికా వెళ్లాలని.. అక్కడే చదువుకోవాలని.. అక్కడే స్థిరపడాలని భారతీయులు చాలా మంది కలలు కంటున్నారు. ఇటీవల ప్రభుత్వాలు కూడా విదేశీ విద్యను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలను అమెరికా పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్‌ ఉండాలంలే అమెరికా పంపించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం అప్పులు చేస్తున్నారు. కష్టపడుతున్నారు. అయితే అమెరికా ఏటా జారీ చేసే హెచ్‌–1బీ వీసాలు భారతీయులకు చాలడం లేదు. డ్రా పద్ధతి ప్రవేశపెట్టడం కూడా కొందరికి ఇబ్బందిగా మారుతోంది. అయితే ఈ డ్రా సిస్టంనే కొందరు తమకు అనుకూలంగా మార్కుకుంటున్నారు. అడ్డదారిలో భారతీయులను అమెరికాకు పంపుతున్నారు. గతంలో ఈ విషయంలో భారతీయులపై అభియోగాలు మోపింది అమెరికా. తాజాగా మరో తెలుగు వ్యక్తిపై అభియోగాలు మోపింది. నానోసెమాంటిక్స్‌ అనే బే ఏరియా స్టాఫ్‌ ఫ్రిమ్‌ సహ–యజమాని కిషోర్‌ దత్తాపురం(55), అతను, అతని ఇద్దరు సహచరులు పోటీదారులపై ప్రయోజనం పొందేందుకు హెచ్‌–1బీ వీసా వ్యవస్థను ఎలా మానిప్యులేట్‌ చేశారో హైలైట్‌ చేసే ఒక కేసులో వీసా మోసానికి నేరాన్ని అంగీకరించాడు.

    అడ్డదారిలో ఉద్యోగాలు..
    కిషోర్‌ దత్తాపురంతోపాటు అతని ఇద్దరు సహచరులు కుమార్‌ ఆవాస్పతి, సంతోషగిరితోపాటు మరో ముగ్గురు తెలుగు వ్యక్తులు టెక్‌ కంపెనీలో విదేశీ ఉద్యోగులు ఉద్యోగాలు పొందారని పేర్కొంటూ హెచ్‌–1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి, ఆ ఉద్యోగాలు భర్తీ కాలేదు. కానీ వీసా పొందేందకు, తర్వాత ఉద్యోగాలు తెచ్చుకునేందుకు ఇలా చేశారు. కిఠిన నిబంధనల కారణంగా వీసా రావడం కష్టమని తెలిసి ఈ మార్గం ఎంచుకున్నారు. వీసా జారీలో లొసుగుల ఆధారంగా వెళ్లాలనుకున్నారు.

    ఎదురుదెబ్బ..
    అక్రమంగా అమెరికా వెళ్లాలనుకున్న వారికి ఎదురు దెబ్బ తగిలింది. వారు పట్టుబడడమే కాకుండా, భారీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందంటున్నారు. అందుకే నిజాయతీగా వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చీటింగ్‌ కూడా ఒకటి రెండుసార్లు చెల్లుబాటు అవుతుంది. కానీ, పట్టుపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. భవిష్యత్‌ను క్లిష్టతరం చేస్తుంది.