World Soil Day 2024: చాలా మందికి ఇండిపెండెన్స్ డే, వాలంటైన్స్ డే, రిపబ్లిక్ డే గురించి తెలుసు. కానీ నేలకూ ఒక రోజు ఉందని తెలియదు. ఎందుకంటే దీనికి అంతగా ప్రచారం ఉండదు. పెద్దగా జరుపుకోరు. కానీ, ఇది చాలా ముఖ్యమైనది. మనం జీవించేందుకు నేల కావాలి. ఆహారం పండించేందుకు భూమి ఉండాలి. నేల లేకుంటే మనం లేము. ప్రకృతి ప్రసాధించిన గొప్ప వరం భూమి. నేల నుంచే మనం అన్నీ పొందుతున్నాం. కానీ, నేలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నేలను నాశనం చేస్తున్నారు. భూ కాలుష్యం పెంచుతున్నారు. పురుగు మదులతో సహజత్వం కోల్పోయేలా చేస్తున్నారు. యుద్ధాలతో బాంబుల వేసి నేల సారం చంపేస్తున్నారు. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం.
ప్రాముఖ్యత…
భూమిపై మూడో వంతు నీరే ఉంటుంది. భూమి ఉన్నది ఒక వంతు మాత్రమే. ఈ విశ్వంలో మనం జీవించేందుకు ప్రస్తుతం ఒకే ఆప్షన్ భూమి. అది చాలా అమూల్యమైనది. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భూరక్షణపై అవగాహన పెంచడానికి ఏటా డిసెంబర్ 5న నేల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పంచ భూతాల్లో ఒకటి భూమి. ఇది లేకపోతే ప్రపంచం లేదు. సకల జీవరాశుల మనుగడకు భూమే ఆధారం. కానీ వాతావరణ మార్పులు, భూతాపం, కాలుష్యం నేలను నాశనం చేస్తున్నాయి. అందుకే 2002 నుంచి అంతర్జాతీయ సాయిల్ సైన్సెస్ యూనియన్ డిసెంబర్ 5న నేల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. 2013లో దీనిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ నేల దినోత్సవంగా ప్రకటించారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. నేలను కాపాడుకోవడం గురించి వివరిస్తున్నారు. నేల విషలుతయ్యమైతే కలిగే దుష్పరిణామాలను తెలియజేస్తున్నారు.
ఆందోళనకర పరిస్థితి..
ప్రస్తుతం నేల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రోజుకు లక్షల టన్నుల చెత్త భూమిపై పరుకుపోతోంది. ప్లాస్టిక్ వినియోగం భూమికి హానిగా మారుతోంది. డ్రెయినేజీ, మురుగునీరంతా నదులు, సముద్రాల్లోకి చేరుతోంది. దీంతో నేతల సహజత్వం కోల్పోతోంది. భూసారం దెబ్బతింటోంది. పంటల దిగుబడి తగ్గుతోంది. పెరిగిన ఎరువుల వాడకం భూమికి విషంగా మారింది.
ఒక్క రోజే జాగ్రత్తలు..
నేత దినోత్సవం వచ్చిన రోజే అందరూ భూమి గురించి గుర్తు చేసుకుంటారు. ఇకపై అలా చేయకూడదని అనుకుంటారు. కానీ, ఉరుకుల పరుగుల జీవితంలో తర్వాత భూమి రక్షణను విస్మరిస్తున్నారు. కానీ, ఎంతో ఓపిక ఉన్న భూమాత కూడా అన్నీ భరిస్తోంది. అప్పుడప్పుడు ఒళ్లు విరుచుకుంటోంది. ఫలితంగా భూకంపాలు సంభవిస్తున్నాయి. కాలుష్యం ఇలాగే పెంచుకుంటూ పోతే.. రాబోయే రోజుల్లో విధ్వంసాలు ఖాయం. భారీ భూకంపాలు వస్తే.. ప్రపంచం నాశనమవుతుంది. ఈ నేపథ్యంలో భూమి రక్షణకు అందరం ఎంతో కొంత ప్రయత్నించాలి.
2024 నేల దినోత్సవం థీమ్..
నేల సంరక్షణ.. కొలవడం, పర్యవేక్షించడం, నిర్వహించడం అనే ది 2024 థీమ్‌గా ఎంచుకున్నారు. నేల ఆరోగ్యం, స్థిరత్వాన్ని నిర్ధారించే పద్ధతులను అనుసరించమని ప్రజలను మరియు సంస్థలను ప్రోత్సహిస్తుంది. ప్రపంచ నేల దినోత్సవం 2024 కోసం నినాదాలు.. నేలను సంరక్షించండి, జీవితాన్ని కాపాడుకోండి!, నేల విషయాలు, దానిని జాగ్రత్తగా చూసుకోండి! నేలను పోషించు, భవిష్యత్తును పోషించు!, ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన గ్రహం!, నేలను రక్షిద్దాం, జీవాన్ని పోషించుకుందాం!, గౌరవాన్ని విత్తుదాం, నేల ఆరోగ్యాన్ని పొందుదాం!, నేల: మన నిశ్శబ్ద జీవన మూలం!, పరిరక్షణ మట్టి నుండి ప్రారంభమవుతుంది! నేల ఆరోగ్యం కోసం లోతుగా తవ్వుదాం!