Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది, భారత వ్యతిరేక సంస్థను నడిపే పంజాబ్ వేర్పాటు వాదులకు కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఆతిథ్యం ఇస్తున్నారు. ఫలితంగా భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీస్తున్నాడు. తాజాగా ట్రూడో కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా దౌత్య సంబంధాలు క్షిణించాయి. భారత్‌తో కెనడా ఇలా వ్యవహరించడం కొత్తేమీ కాదు. ట్రూడో తండ్రి కూడా భారత వ్యతిరేకే. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ట్రూడో తండ్రిని మించిన శత్రువులగా వ్యవహరిస్తున్నాడు. ట్రూడో తండ్రి పిరె ఇలియట్ ట్రూడో కూడా గతంలో ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఊతమిచ్చాడు. 300 మందికిపైగా భారతీయు ప్రయాణికులతో కూడిన కనిష్క్ విమానాన్ని పేల్చడానికి ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరించారు. భారత్‌తో ఘర్షణాత్మక విధానమే అవలంబించాడు. ఇప్పుడు జస్టిన్ ట్రూడో కూడా అదే పాటిస్తున్నాడు.
విమానం కూల్చివేతకు సహకారం..
1985లో కెనడాలోని టోరంటో నుంచి యుకేకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కనిష్క్‌ను అదే ఏడాది జూన్ 23న పేల్చడానికి ఖలిస్తాన్ ఉగ్రవాదులు సూట్‌కేసులో బాంబులు పెట్టి పేల్చేశారు. దీనికి ప్రధాన సూత్రధారిగా కెనడాలో తలదాచుకున్న ఖలిస్తానీ ఉగ్రవాది తల్వీందర్‌సింగ్ పర్మార్. నాటి కెనడా ప్రధాని పిరెట్రూడో ఉగ్రవాది అయిన పర్మార్‌ను వెనకేసుకొచ్చాడు. పర్మార్‌ను అప్పగించమని భారత్ ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. పర్మార్ సహా పలువురిని అరెస్ట్ చేసింది కానీ, ఒక్కరికి మాత్రమే 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అందరినీ వదిలేసింది. ప్రమాదానికి ముందే.. భారత నిఘా వర్గాలు కెనడాకు సమాచారం ఇచ్చాయి. కానీ, కెనడా ప్రధాని పట్టించుకోలేదు. ఈ ప్రమాదంపై విచారణ జరిపిన జస్టిస్ జాన్ మేజర్ కమిషన్ కెనడా నిఘా విభాగాన్ని, పోలీసులను తప్పు పట్టింది.
దేశం నుంచి వలసలు…
ప్రపంచ యుద్ధాల సమయంలో భారత సైనికులు బ్రిటన్ తరఫున యుద్ధం చేశారు. ఈ కారణంగా స్వాతంత్య్రానికి ముందు నుంచే పంజాబ్‌కు చెందిన అనేక మంది సిక్కులు కెనడా వెళ్లి స్థిరపడ్డారు. 1970లో కెనడా ఇమ్మిగ్రేషన్ చట్టాలు సులభతరం కావడంతో భారత్ నుంచి భారీగా వలసలు పెరిగాయి. ఇదే సమంయలో పంజాబ్‌లో ఖలిస్తానీవాదం పెరిగింది. వారిపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీంతో వేర్పాటు వాదులకు కెనడా సురక్షితమైన స్థావరంగా మారింది. పంజాబ్‌లో ఇద్దరు పోలీసులను కాల్చి చంపి కెనడా పారిపోయన వారిలో తల్వీందర్‌సింగ్ పర్మార్ కూడా ఒకరు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడాలోని భారతీయ అధికారులు నేతలను బెదిరిండపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాటి కెనడా ప్రధాని పిరె ట్రూడోకు సమాచారం ఇచ్చారు. అయినా పెద్దగా పట్టించుకోలేదు.
రాణిగా అంగీకరించలేదని..
ఇక పర్మార్‌ను తమకు అప్పగించాలని 1982లోనే కెనడా ప్రభుత్వానికి భారత్ విజ్ఞప్తి చేసింది. కానీ ట్రూడో ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అందుకు కారణం ఎలిజబెత్ రాణి హోదా! భారత్ ఎలిజిబెత్ రాణిని కామన్వెల్త్ అధినేతగానే గుర్తించింది. దీంతో భారత్ కెనడా మధ్య కామన్వెల్త్ ఒప్పంద ప్రకారం నేరగాళ్ల అప్పగింత లేదని కెనడా దౌత్యవేత్తలు తెలిపారు. ఇలా ఉగ్రవాది పర్మార్‌ను వెనకేసుకొచ్చాడు పిరె ట్రూడో. తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి దొంగతనంగా వచ్చిన పర్మార్‌ను పంజాబ్ పోలీసులు 1992లో మట్టుపెట్టారు. ఇక కనిష్క్ ప్రమాదానికి కారణమై శిక్ష పడిన నేరస్తుడు ఇందరీత్‌సింVŠ ను ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో విడిచిపెట్టాడు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Special article on canadian president justin trudeau
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com