South Carolina: యూఎస్ లోని కరోలినాలో గుర్తుతెలియని దుండుగులు కాల్పులకు పాల్పడ్డారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ప్రాణాలకు కాపాడుకోవానికి ప్రజలు పరుగులు పెట్టారు. ఈ దాడిలో 11 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల సౌత్ కరోలినాలో అరాచకశక్తుల ఆగడలు విపరీతంగా పెరిగిపోయాయి. గత నెలలో కరోలినాలోని ప్రసిద్ధ పర్యాటక మిర్టిల్ బీచ్ లో దుండగులు కాల్పులకు పాల్పడడంతో ఓ వ్యక్తి మరణించాడు.