Sheep Herder Salary In China: శీర్షిక చదివి ఆశ్చర్యపోతున్నారా.. గొర్రెలు కాస్త నెలకు 1.1 లక్షలు ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా.. మీరు ఎలా అనుకున్న సరే మీరు చదివింది నూటికి నూరు శాతం నిజం. కేవలం జీతం మాత్రమే కాదు.. వసతి కల్పిస్తారు. ఇంకా కొన్ని రకాల ప్రయోజనాలు కూడా అందిస్తారు.. నేటి కాలంలో పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ.. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ స్థిరత్వం లేకుండా పోతుంది. పైగా కంపెనీలు అడ్డగోలుగా తీసివేయడంతో ఉద్యోగం అనేది ఎండ మావిలాగా మారిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం వల్ల జీవితానికి ఆర్థిక స్థిరత్వం లేకుండా పోతుంది.
ఇటువంటి విపత్కర పరిస్థితిలో గొర్రెలు కాసే వాళ్లకు ప్రతినెల 1.1 లక్షలు ఇవ్వడం అంటే మాటలు కాదు. అయితే ఈ స్థాయిలో వేతనం ఇస్తున్నది మనదేశంలో కాదు. మన పక్కనే ఉన్న చైనాలో. చైనా దేశంలో గొర్రెల కాపరులకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్లే అక్కడ గొర్రెలను కాయడానికి ప్రతినెల 1.1 లక్షలు వేతనంగా ఇచ్చేందుకు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. దానికి సంబంధించిన ప్రకటనను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త విపరీతంగా సర్కులేట్ అవుతుంది. ఇప్పటికే ఆ ప్రకటన కోట్లల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.
చైనా దేశంలో జూవో జియోవో యాంగ్ అనే వ్యక్తికి విస్తారంగా గొర్రెలు ఉన్నాయి. అయితే వాటిని మేపడానికి కాపరులు కావాలి. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాపరులుగా పని చేయడానికి ఇద్దరు వ్యక్తులు కావాలని అతడు సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. కాపరులుగా పని చేసే వ్యక్తులకు ప్రతినెల 1.1 లక్షలు వేతనంగా ఇస్తానని.. వసతి కూడా కల్పిస్తానని ప్రకటించాడు. అతడు చేసిన ప్రకటన విపరీతంగా చర్చకు దారితీసింది. అంతేకాదు చాలామంది తాము కాపరులుగా పని చేస్తామని ముందుకు వచ్చారు. ఇందులో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. చివరికి గొర్రెల కాపరులుగా పని చేయడానికి అయినా సిద్ధమేనని ముందుకు వస్తున్నారు. అయితే భారీగా దరఖాస్తులు రావడంతో.. వారు గొర్రెలు కాసే విధానాన్ని చూసిన తర్వాత పనిలోకి తీసుకుంటానని జివో చెబుతుండటం విశేషం.
గొర్రెల పెంపకం ద్వారా జివో భారీగా సంపాదిస్తుంటాడు. గొర్రెల మాంసంతో పాటు వాటి వెంట్రుకలను కూడా విక్రయిస్తుంటాడు. చైనాలో గొర్రెల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందువల్లే జివో భారీగా గొర్రెలను సాకుతూ ఉంటాడు. ఇతడికి భారీ ఎత్తున గొర్రెల ఫామ్ లు ఉన్నాయి.
