Saudi Arabia : ముస్లింలకు అతి పవిత్ర ప్రదేశం మక్కా. హజ్(Haz) యాత్ర పేరుతో ఏటా ప్రపచం దేశాల నుంచి ముస్లింలు మక్కాకు వెళ్తారు. ఈ ఏడాది హజ్ యాత్ర సమీపిస్తున్న వేళ సౌదీ అరేబియా(Soudi Arebia) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హజ్ సీజన్ ముందు 14 దేశాల పౌరులకు ఉమ్రా(Umra), బిజినెస్(Business), కుటుంబ సందర్శన వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం జూన్(June) మధ్య వరకు, అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉంటుంది. రద్దీ నియంత్రణ, రిజిస్ట్రేషన్ లేని యాత్రికులను అడ్డుకోవడం ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశంగా సౌదీ అధికారులు తెలిపారు.
Also Read : కెనడా పార్లమెంట్‌కు తాళం.. ఒట్టావాలో కలకలం.. ఏం జరిగిందంటే..!
గత అనుభవాల నేపథ్యంలో..
గత ఏడాది హజ్ సమయంలో తీవ్ర వేడి, రిజిస్టర్ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటనలు సంభవించాయి. 2024లో 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతి చెందారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, సౌదీ క్రౌన్ ప్రిన్స్(Croun Prince) మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిషేధాన్ని అమలు చేశారు. రద్దీని తగ్గించి, భద్రతను పెంచేందుకు వీసా నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్రా వీసాల జారీ ఏప్రిల్ 13, 2025తో ముగియనుంది.
నిషేధిత దేశాల జాబితా
ఈ నిషేధం భారత్(India), పాకిస్తాన్(Pakisthan), బంగ్లాదేశ్(Bangladesh)తోసహా 14 దేశాలపై వర్తిస్తుంది. ఇతర దేశాల్లో అల్జీరియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాక్, జోర్డాన్, మొరాకో, నైజీరియా, సుడాన్, ట్యూనిషియా, యెమెన్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి సౌదీ(Soudi)కి వెళ్లాలనుకునే వారికి ఈ నిర్ణయం నిరాశను కలిగించింది. అయితే, హజ్ కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు.
భద్రత, నియంత్రణపై దృష్టి
సౌదీ అధికారుల ప్రకారం, ఈ చర్యలు హజ్ సమయంలో భద్రత(Security)ను కాపాడటానికి, రద్దీని నిర్వహించడానికి ఉద్దేశించినవి. హజ్–నిర్దిష్ట వీసాలు, దౌత్య వీసాలు, నివాస అనుమతులు యథావిధిగా కొనసాగుతాయి. గత సంవత్సరం రిజిస్టర్(Rigistar) కాని యాత్రికుల వల్ల ఎదురైన సమస్యలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హజ్ యాత్రను సురక్షితంగా, సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా సౌదీ ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.
Also Read : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఇరాన్ కరెన్సీ సంక్షోభం.. చరిత్రలో అత్యల్ప స్థాయికి రియాల్