Russia vs NATO: ఉక్రెయిన్‌లోని యుద్ధం మూడేళ్లుగా సాగుతున్నప్పటికీ, ఇటీవలి పరిణామాలు దాన్ని అంతర్జాతీయ స్థాయికి మార్చేస్తున్నాయి. రష్యా యుద్ధాన్ని నాటో సభ్యదేశాల వరకు విస్తరించాలని భావిస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలి డ్రోన్ దాడులు, సైనిక వ్యాయామాలు, రష్యన్ అధికారుల హెచ్చరికలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
డ్రోన్ దాడులు, సరిహద్దు ఉల్లంఘనలు
సెప్టెంబర్ 2025 ప్రారంభంలో, రష్యా యుక్రెయిన్‌పై చేసిన డ్రోన్ దాడులు నాటో సభ్యదేశాల సరిహద్దులను ఉల్లంఘించాయి. సెప్టెంబర్ 9–10 తేదీల్లో, 19 రష్యన్ డ్రోన్‌లు పోలండ్ సరిహద్దును దాటి, యుక్రెయిన్‌పై దాడి చేశాయి. ఇది యుద్ధం ప్రారంభమైన 2022 నుంచి నాటో భూభాగంలో జరిగిన అతి తీవ్రమైన ఉల్లంఘన. నాటో యుద్ధ విమానాలు (పోలిష్ F–16లు, డచ్ F–35లు) డ్రోన్‌లను కూల్చాయి. మొదటిసారిగా నాటో నేరుగా శత్రు లక్ష్యాలపై కాల్పులు జరిపింది. సెప్టెంబర్ 13–14 తేదీల్లో, రష్యన్ డ్రోన్ రొమేనియా హద్దులు దాటింది. ఇది 2022 నుండి 11వసారి. రొమేనియా డిఫెన్స్ స్పందించింది. ఇందుకు రష్యా బాధ్యత వహించాలని ఆరోపించారు. ఇటీవలి వారాల్లో, రష్యా–బెలారస్ ’జాపడ్–2025’ సంయుక్త సైనిక విన్యాసాలు కూడా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచాయి. ఇందులో బాల్టిక్ సముద్రంలో క్షేపణికి ప్రాక్టీస్, నావల్ ఆపరేషన్లు చేపట్టారు. ఇది నాటో దేశాలైన పోలండ్, లిథువేనియా వైపు లక్ష్యంగా ఉందని విమర్శకులు భావిస్తున్నారు. ఈ సంఘటనలు యాదృచ్ఛికం కాదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్సీ్క, ‘డ్రోన్ మార్గాలు రష్యా ద్వారా లెక్కలు చేసినవి‘ అని చెప్పారు. ఈ ఉల్లంఘనలు రష్యా యుద్ధాన్ని ’సలామీ–స్లైసింగ్’ వ్యూహంతో (క్రమంగా పెద్ద లక్ష్యాల వైపు చిన్న చిన్న దశలు) విస్తరించడానికి ప్రయత్నిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
యుద్ధం విస్తరించాలనుకుంటోందా?
రష్యా అధికారులు ఈ పరిణామాలను ’స్వరక్షణ’గా చూపిస్తున్నారు, కానీ వాస్తవానికి ఇది నాటోపై ఒత్తిడి పెంచే వ్యూహం. రష్యా భద్రతా మండలి అధ్యక్షుడు డ్మిట్రీ మెద్వెదెవ్, ‘ఉక్రెయిన్ పైన నో–ఫ్లై జోన్ అమలు చేస్తే, అది నాటో–రష్యా యుద్ధానికి సమానం‘ అని హెచ్చరించారు. పుటిన్ మాటల మీదుగా డెమిట్రీ పెస్కోవ్, ‘నాటో ఇప్పటికే రష్యాతో యుద్ధంలో ఉంది‘ అని ప్రకటించారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ (ఐఎస్‌డబ్ల్యూ) ప్రకారం, రష్యా తన సమాజాన్ని, యువతను మిలిటరైజ్ చేస్తూ, మరో 5 సంవత్సరాల్లో నాటోపై దాడి చేయడానికి సిద్ధమవుతోంది. డ్రోన్ ఉల్లంఘనలు ఇలాంటి ’హైబ్రిడ్ వార్‌ఫేర్’ భాగం – ఇది సైబర్, డ్రోన్, జీపీఎస్ జామింగ్‌తో కలిపి నాటో ఏకీకరణను పరీక్షిస్తుంది. అయితే, రష్యా యుద్ధాన్ని పూర్తిగా విస్తరించాలని కోరుకోవడం లేదు. ఇది పుతిన్‌కు అనుకూలమైన శాంతి చర్చలకు ఒత్తిడి పెంచడానికి, ట్రంప్ పాలిసీలను ప్రభావితం చేయడానికి వ్యూహాత్మకం. రష్యా డ్రోన్ ఉత్పత్తిని 2025లో డబుల్ చేసింది. ఇది యుక్రెయిన్‌లోనే కాకుండా, పొర్సియా వంటి ఇతర ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది.
స్పందించిన నాటో..
నాటో ఈ ఉద్రిక్తతలకు తీవ్రంగా స్పందించింది. సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, ‘రష్యా చర్యలు అతి ఆశ్చర్యకరమైనవి‘ అని పేర్కొన్నారు. పోలండ్ ’ఆపరేషన్ ఈస్టర్న్ సెంట్రీ’లో నాటో బలగాలను మోహరించింది, జర్మన్ ప్యాట్రియట్ ఏర్ డిఫెన్స్ సిస్టమ్‌లను అలర్ట్‌లో ఉంచింది. ఐకేయ యూరోపియన్ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్, ‘రష్యా యుద్ధం ముదురుతోంది, ముగిసేది కాదు‘ అని చెప్పారు. నాటో యుక్రెయిన్‌కు 2025లో 35 బిలియన్ల సెక్యూరిటీ సపోర్ట్‌ను ప్రకటించింది, జాయింట్ అనాలిసిస్, ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా యుద్ధ పాఠాలను పంచుకుంటోంది.
యుద్ధం ముదిరే అవకాశం ఉంది. కానీ, పూర్తి స్థాయి కాదు. డ్రోన్ ఉల్లంఘనలు ’గ్రే జోన్’ యుద్ధాన్ని సూచిస్తున్నాయి – ఇది ప్రత్యక్ష యుద్ధం లేకుండా ఒత్తిడి పెంచుతుంది. రష్యా అణు బెదిరింపులు (మెద్వెదెవ్ హెచ్చరికలు) ఉన్నప్పటికీ, ఇది డిటరెన్స్ కోసం మాత్రమే. పతిటిన్ నాటోతో పూర్తి యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కాదు, ఎందుకంటే ఇది రష్యా ఆర్థిక, సైనిక బలహీనతలను బహిర్గతం చేస్తుంది.