Deepika Padukone removed from Kalki 2: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టించిన సినిమాల్లో ఒకటి ‘కల్కి 2898 AD'(Kalki 2898 AD). రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లకు పైగా రాబట్టింది. ఈ సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చూస్తున్నంతసేపు ఒక విజువల్ వండర్ లాగానే ఫీల్ అయ్యారు. ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టుగా అనిపించింది. ముఖ్యంగా మహాభారతం కి లింక్ పెట్టడం అద్భుతంగా అనిపించింది. చివర్లో ప్రభాస్ కర్ణుడి గా రివీల్ అయ్యే సన్నివేశం అయితే ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని చేసింది. అంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ త్వరలోనే తెరకెక్కనుంది. అయితే మొదటి భాగం లో హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొనే(Deepika Padukone), రెండవ భాగం లో నటించట్లేదని కాసేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ‘దీపికా పదుకొనే కల్కి సీక్వెల్ లో నటించట్లేదని ఈ సందర్భంగా మీ అందరికీ అధికారిక ప్రకటన చేస్తున్నాము. చాలా సుదీర్ఘమైన చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. మాతో ఆమె మొదటి సినిమా లో చాలా పెద్ద ప్రయాణమే చేసింది. అయినప్పటికీ కూడా ఆమె భాగస్వామ్యం ని రెండవ భాగం కోసం తీసుకోలేకపోతున్నాము. కల్కి లాంటి అద్భుతమైన సినిమాకు కమిట్మెంట్ అవసరం. అది ఆమెలో లేదు, అందుకే తొలగిస్తున్నాము. ఆమెకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంతలా కఠినంగా ఆమె గురించి చెప్పే పరిస్థితి వచ్చిందంటే, దీపికా పదుకొనే ఆ మూవీ టీం తో ఎంత పొగరు యాటిట్యూడ్ తో ప్రవర్తించి ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రం లో హీరోయిన్ రోల్ కోసం సందీప్ ముందుగా ఈమెనే సంప్రదించాడు.
ఆమె నటించడానికి ఒప్పుకుంది కానీ, ఆమె పెట్టిన డిమాండ్స్ కి సందీప్ వంగ ఒప్పుకోలేదు. దీంతో ఆమెని ఆ సినిమా నుండి తప్పించి, వేరే హీరోయిన్ ని తీసుకున్నాడు సందీప్ వంగ. దీంతో ఈమె సందీప్ వంగ పై పగ పెంచేసుకుంది. సందీప్ పై పగ పెంచుకోవడం లో అర్థం ఉంది కానీ, సెన్స్ లేకుండా ప్రభాస్ పై పగ పెంచుకోవడం ఏమిటి?, దీపికా పదుకొనే కి ఇంత అహంకారామా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే దీపికా ని ఏకిపారేస్తున్నారు. కల్కి లో ఆమెకు అద్భుతమైన రోల్ దొరికింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్స్ తో కలిసి ఒకే సినిమాలో నటించే అదృష్టం దొరికింది. ప్రభాస్ పై గౌరవం లేదు సరే, కానీ కల్కి సీక్వెల్ లో పని చేయబోతున్న కమల్ , అమితాబ్ లాంటి లెజెండ్ పైన అయినా గౌరవం ఉండాలి కదా, ఒక మూవీ టీం అసహం తో పై విధంగా కామెంట్స్ చేసింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈమె క్యారక్టర్ ఎలాంటిది అనేది.